గోంగూర చట్నీ.. గోంగూర పప్పు.. గోంగూర చికెన్.. ఇలా ఎన్నో రకాల కూరలు చేసుకొని తిని ఉంటాము. అవి ఎంతో రుచిగా నోటి తగలగానే కరంగా అబ్బా ఇలా నోరు ఊరిస్తూ అద్భుతంగా ఉంటాయి. అయితే ఈ గోంగూరను చికెన్ లాంటి మీల్ మేకర్ తో కలిపి తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ గోంగూర మీల్ మేకర్ ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావలసిన పదార్థాలు... 

 

మీల్‌మేకర్‌ -100 గ్రా., 

 

గోంగూర - 2 కట్టలు, 

 

ఉల్లిపాయలు - 2, 

 

పచ్చిమిర్చి - 4, 

 

ఎండుమిర్చి - 2, 

 

వెల్లుల్లి - 6 రేకలు, 

 

జీలకర్ర - అర టీ స్పూను, 

 

కారం - 1 టీస్పూను, 

 

పసుపు - చిటికెడు, 

 

నూనె - 1 టేబుల్‌ స్పూను, 

 

వేగించిన నువ్వుల పొడి - అరకప్పు, 

 

ఉప్పు - రుచికి తగినంత.


 
తయారీ విధానం...

 

గోరు వెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి మీల్‌మేకర్‌ని 10 నిమిషాలు నానబెట్టి నీరు పిండి పక్కనుంచాలి. నూనెలో జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి వేగించి మీల్‌మేకర్‌ కలపాలి. 5 నిమిషాల తర్వాత గోంగూర వేసి మూతపెట్టాలి. 2 నిమిషాల తర్వాత కారం, పసుపు, ఉప్పు చల్లి 2 కప్పుల నీరు పోసి మూత పెట్టి మగ్గించి దించెయ్యాలి. ఈ కూర అన్నంతో కలుపుకుంటే మటన్‌ గోంగూర తిన్న ఫీలింగ్‌ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఇంట్లో ట్రై చెయ్యండి. గోంగూర మీల్ మేకర్ అదిరిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: