చేప.. సీఫుడ్ ప్రియులు చాలామంది ఉంటారు. ఆలా ఎంతోమంది సీఫుడ్ ప్రేమికులు సీ ఫుడ్ అంటే చాలు నోరూరిపోతుంది. అయితే సీఫావుడ్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఫిష్, రొయ్యలు, క్రాబ్స్ ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే ఇందులో ప్రతి ఒక్కరికి నచ్చే సీఫుడ్ ఏంటి అంటే ఫిష్. ఈ ఫిష్ సీఫుడ్ ఎన్నో రకాలుగా తయారు చెయ్యచ్చు. అయితే ఎంతో రుచికరంగా ఫ్రై కావాలంటే మాత్రం అరిటాకు చేప తినాల్సిందే. అంతటి టేస్టీ అరిటాకు చేపను ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావాల్సిన పదార్థాలు... 

 

చేపలు రెండు, 

 

కొద్దిగా నిమ్మరసం, 

 

కొబ్బరి తురుము రెండు టీస్పూన్లు, 

 

తరిగిన పచ్చిమిర్చి నాలుగు, 

 

కొద్దిగా కొత్తిమీర

 

వెల్లుల్లి నాలుగు రెబ్బలు, 

 

ఒక టీ స్పూను జీలకర్ర

 

చిన్న అరిటాకులు రెండు. 

 

తయారీ విధానం.. 

 

చేపలను కొంచెం పెద్దముక్కలుగా కట్‌ చేసుకోవాలి. వాటిపై నిమ్మరసం, ఉప్పు చల్లి పావుగంటసేపు నాననివ్వాలి. కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర కలిపి పేస్టు చేసుకోవాలి. ఒక్కో చేప ముక్కను ఒక్కో అరిటాకులో పెట్టి మసాలా పేస్టును ముక్కలకు రెండుపక్కలా పట్టించాలి. అరిటాకులను మడిచి ఊడిపోకుండా దారంతో కట్టాలి. వాటిని ఆవిరిలో ఏడు నిమిషాలపాటు ఉడికిస్తే నోరూరించే అరిటాకు ఫిష్‌ రెడీ అయిపోతుంది. ఈ అరిటాకు ఫిష్ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.. ఆ రుచికి పిల్లలు ఇంకా ఇంకా కావాలని అడుగుతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: