ఎగ్ ఫ్రైడ్ రైస్.. అప్పుడప్పుడు ఫాస్ట్ ఫుడ్ తినాలి అని అందరికి ఉంటుంది. అయితే ఈ ఫాస్ట్ ఫుడ్ బయటా చేసుకుంటే ఒక టేస్ట్ ఇంట్లో చేసుకుంటే మరో టేస్ట్ ఉంటుంది. దీంతో ఈ ఫాస్ట్ ఫుడ్ బయట టేస్ట్ ఎలా వస్తుంది.. అంత రుచిగా ఎలా చెయ్యగలం అని అందరూ తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలా ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. ఇంట్లో తయారు చేసుకోండి. 

 

కావలసిన పదార్థాలు... 

 

గుడ్లు - 3, ఉల్లిపాయ - 1, 

 

ఉప్పు - రుచికి తగినంత, 

 

మిరియాల పొడి - పావు టీ స్పూను, 

 

పచ్చిమిర్చి - 1, 

 

ఉల్లికాడల తరుగు - గుప్పెడు, 

 

నూనె - 1 టీ స్పూను.

 

తయారీ విధానం...

 

ఒక గిన్నెలో గుడ్ల సొన, ఉప్పు, (కొద్దిగా) మిరియాలపొడి వేసి బాగా గిలకొట్టాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు నూనెలో దోరగా వేగాక ఉల్లికాడ, పచ్చిమిర్చి తరుగు (పెద్దమంటపై) గుడ్ల మిశ్రమం ఒకటి తర్వాత ఒకటి వేగించి, మిగిలిన మిరియాలపొడి చల్లాలి. ఇప్పుడు అన్నం వేసి బాగా కలిపి వేడి వేడిగా తినాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: