స్వీట్ గవ్వలు, సాల్ట్ గవ్వలు, కారం గవ్వలు ఇలా మూడు రకాల గవ్వలు తిని ఉంటాము. అయితే సామల గవ్వలను ఎప్పుడైనా తిన్నారా ? అవి ఎలా ఉంటాయో తెలుసా ? ఎంత బాగుంటాయో తెలుసా ? ఈ గవ్వలను పెద్దలే కాదు పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఈ స్నాక్స్ పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. 

 

అయితే ఈ గవ్వలు టేస్టీగానే కాదు ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. అలాంటి ఈ గవ్వలను ఎలా చెయ్యాలో తెలుసా ? ఇక్కడ చదివి ఎలా చెయ్యాలో తెలుసుకోండి.. ఇంట్లో వారికీ చేసి పెట్టండి.. 

 

కావలసిన పదార్థాలు... 

 

సామల పిండి - 300 గ్రా., 

 

గోధుమపిండి - 100 గ్రా., 

 

జొన్న రవ్వ - 25 గ్రా., 

 

వెన్న - 10 గ్రా., 

 

బెల్లం - 300 గ్రా., 

 

నూనె - 400 మి.లీ., 

 

యాలకుల పొడి - 10 గ్రా.,

 

నీళ్ళు - 175 మి.లీ.


 
తయారీ విధానం... 

 

సామల పిండి, గోధుమ పిండి, రవ్వలో కరిగించిన వెన్న వేసి, వేడి నీళ్ళు పోస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. విడిగా బెల్లాన్ని తీగ పాకం రానిచ్చి అందులో యాలకుల పొడి వేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె కాగిన తరువాత ఉండలను గవ్వ చెక్క మీద చుట్టి, నూనెలో ఎర్రగా వేయించి తీయాలి. ముందుగా తయారు చేసుకున్న పాకంలో వేసి 30 నిమిషాలు ఉంచాలి. అంతే గవ్వలు రెడీ అయిపోతాయి. ఈ గవ్వలలో ఎంతో శక్తి వస్తుంది. 100 గ్రాముల గవ్వల పదార్థంలో శక్తి 355 కి.కెలోరీలు, ప్రొటీన్లు 6.7 గ్రా ఉంటుంది. చూశారుగా ఇంకెందుకు ఆలస్యం వెంటనే గవ్వలను ఇంట్లో వారికీ చేసి పెట్టండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: