సృష్టిలో ఎంతో తియ్యనైనది తల్లి ప్రేమ.... అమ్మ ప్రేమ వివరించడానికి మన ఈ జన్మ సరిపోదు. ఎందుకంటే ప్రేమంటే ఏంటో మొదట మనకు తెలిసేది తల్లి దగర నుండే ఆ తల్లి ప్రేమను వర్ణించడానికి భాష సరిపోదు. అది అనుభవిస్తే వచ్చే ఓ తియ్యని వరం.

 

          అందుకేమో ఓ కవి అన్నాడు "ఎవరు రాయగలరు అమ్మ అను మాటకన్న తియ్యని కావ్యం , ఎవరు పాడగలరు అమ్మ అను రాగం కన్నా తియ్యని రాగం అని" నిజంగానే "పెదవే పలికిన మాటల్లో తియ్యని మాటే అమ్మష‌. అమృతం లో "అ" అనే అక్షరాన్ని, మాధుర్యం "మా" అనే అక్షరాన్ని కలిపితే "అమ్మ"!!!!"

 

ఎంత మందితో గ‌డిపినా కూడా రోజూ అమ్మ‌తో కాసేపు మాట్లాడితే చాలు అదొక‌ర‌క‌మైన మ‌న‌:శాంతి ద‌క్కుతుంది. ఎటువంటి స‌మ‌స్య‌నైనా మ‌నం మ‌న‌స్ఫూర్తిగా చెప్పుకోదగ్గ ఒకేఒక్క వ్య‌క్తి అమ్మ‌. అమ్మ‌తో ఏ స‌మ‌స్య గురించి చెప్పినా ఆ స‌మ‌స్య నుండి త‌న బిడ్డ‌ను ఏ విధంగా బ‌య‌ట‌ప‌డేయాలా అని త‌ప‌న‌ప‌డేదే అమ్మ‌. ప్ర‌స్తుతం ఉండే యాంత్రిక జీవితంలో అమ్మ‌తో గ‌డ‌ప‌డం సంగ‌తి ప‌క్క‌న పెడితే మాట్లాడ‌ట‌మే క‌రువైపోయింది. వృద్ధులైన త‌ల్లిదండ్రుల‌తో గ‌డిపే స‌మ‌యం ఎవ్వ‌రికీ లేదు. ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా స‌రే ఒక‌సారి పెళ్ళై వాళ్ళ‌కు ఒక కుటుంబం వ‌స్తే చాలు త‌ల్లిదండ్రుల‌ను గుర్తుపెట్టుకునేవారై క‌రువైపోయారు. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ప్రేమ మొత్తం వాళ్ళ పిల్ల‌ల‌వైపు వెళిపోత‌ది. 

 

బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు. అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు? మన పెద్దలు సైతం మాతృదేవోభవ', పితృదేవోభవ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చారు. ప్రపంచంలో ఏ ప్రాంతలోనైనా, ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు. కానీ అమ్మ ప్రేమ మారదు. మనకు ఏ మాత్రం బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం. నాన్నా అని అనం. అలా అని నాన్న ఏం చెడ్డవాడు కాదు. అమ్మ స్థానం అంత గొప్పది.

మరింత సమాచారం తెలుసుకోండి: