మష్రూమ్ .. శాకాహారులకు ఇదే మాంసం. ఈ మష్రూమ్ తో కూర వండిన, బిర్యానీ చేసిన, ఫ్రైడ్ రైస్ చేసిన అదిరిపోతుంది. అయితే హోటల్ లో అప్పుడప్పుడు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తిని ఉంటాము.. కానీ ఎగ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తిని ఉండము. అసలు అది ఎలా చేసుకోవాలో కూడా తెలీదు. అలాంటివారు ఈ మష్రూమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ చేసుకొని తినండి. ఆహా ఏమి రుచి అని అంటారు.. ఆ మష్రూమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీ ఎలా చేయాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావలసిన పదార్థాలు... 

 

అన్నం - 1 కప్పు, 

 

తరిగిన ఉల్లిపాయలు - అర కప్పు, 

 

అల్లంవెల్లుల్లి పేస్టు -1 టీ స్పూను, 

 

మష్రూమ్స్‌  - అరకప్పు, 

 

టమేటో -1, 

 

గుడ్డు -1, 

 

కొత్తిమీర తరుగు - అరకప్పు, 

 

కారం - పావు టీ స్పూను, 

 

నిమ్మరసం - పావు టీ స్పూను, 

 

ఉప్పు - రుచికి తగినంత, 

 

నూనె - 1 టేబుల్‌ స్పూను.

 

తయారీ విధానం.. 

 

కడాయిలో నూనెవేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు వేగాక మష్రూమ్స్‌ ముక్కలు వేసి దోరగా వేగనివ్వాలి. తర్వాత కారం, జీరా, ధనియా పొడులు, చాట్‌ మసాల, కొత్తిమీర, ఉప్పు వేసి నిమిషం తర్వాత గుడ్డు సొన వేయాలి. గుడ్డు పొడిపొడిగా అయ్యాక అన్నం వేసి అట్లకాడతో బాగా కలిపి నిమ్మరసం చల్లాలి. ఈ రైస్‌ని వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఎగ్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తినండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: