కచ్చితంగా పాటించాలి. తల్లి చెవులు, భుజాలు, పిరుదులు నిలువుగా ఒకే కోణంలో ఉండేలా కూర్చోవాలి. ఎటువైపు పాలిస్తున్నారో ఆ వైపు ఈ నియమం తప్పకుండా పాటించాలి. బిడ్డ మీదకు వంగకుండా బిడ్డను రొమ్ముల దగ్గరకు తల్లి తెచ్చుకోవాలి. ఈ భంగిమ తల్లి, బిడ్డలిద్దరికీ ఎంతో సౌకర్యవంతమైనది. తల్లికి ఎప్పుడూ వెన్నుకు సపోర్ట్‌ ఉండాలి. ఇందుకోసం మంచాన్ని ఆసరాగా చేసుకుని రెండు దిండ్లు వీపు వెనక ఉంచుకుని నిటారుగా కూర్చోవాలి. పాలిచ్చే భంగిమల్లో క్రేడిల్‌, క్రాస్‌ క్రేడిల్‌, ఫుట్‌బాల్‌, ఫుట్‌బాల్‌ హోల్డ్‌ అనే రకాలుంటాయి.


 
ప్రసవం జరిగిన తీరును బట్టి ఈ భంగిమలను అనుసరించాలి. సిజేరియన్‌ అయిన తల్లులైతే ‘ఫుట్‌ బాల్‌ పొజిషన్‌’ పాటించాలి. ఈ భంగిమలో తల్లి దిండ్లకు ఆనుకుని కూర్చుని, బిడ్డ తలను చేత్తో పట్టుకుని పాలు పట్టించాలి. ఇలా చేయటం వల్ల బిడ్డ బరువు తల్లి పొట్ట మీద పడకుండా ఉంటుంది. అలాగే పాలు పట్టించిన తర్వాత తప్పనిసరిగా బిడ్డకు త్రేన్పులు వచ్చేవరకూ భుజం మీద పడుకోబెట్టుకోవాలి. ఇక సాధారణ ప్రసవమైతే ఒళ్లో పడుకోబెట్టుకుని బిడ్డ తలను లేపి రొమ్ముకు ఆనించుకుని పాలు పట్టించాలి. 15 నిమిషాలపాటు ఒక్కో రొమ్ముకూ సమయం కేటాయించాలి. రెండు రొమ్ములనూ సమానంగా బిడ్డకు అందించాలి. ఇలా చేయడం వల్ల పాలు నిల్వ ఉండిపోకుండా ఉంటాయి. పాలివ్వబోయే ముందు, ఇచ్చిన తర్వాత రొమ్ములను శుభ్రం చేసుకోవాలి.

 

స్తనాలను జాగ్రత్తగా ఉంచుకోవడం కూడా ప్రాముఖ్యమైయున్నది. గర్భంతోవున్న చివరి నెలల్లో, స్నానం చేసేటప్పుడు మీ స్తనాలను శుభ్రం చేయాలి, కాని సబ్బు రుద్దకూడదు. చనుమొనల చుట్టూవున్న నల్లటి భాగంలోవున్న గ్రంథులు, సూక్ష్మజీవులను నశింపజేసి, రోగం సోకకుండా కాపాడి, చను మొనలను తడిగా ఉంచే, చమురును ఉత్పత్తి చేస్తాయి. సబ్బు చనుమొనలను శుష్కింపజేస్తుంది, చమురును తొలగిస్తుంది, లేదా పనిచేయకుండా చేస్తుంది. మీ రొమ్ము శుష్కించినట్లయితే లేదా దురదపుట్టినట్లయితే మీరు ఉపశమనాన్నిచ్చే క్రీమ్‌ని గాని, లోషన్‌గాని పూయాలని కోరుకుంటారు. కాని, చనుమొనల పైన లేదా దాని చుట్టూవున్న నల్లని భాగంలో పూయకుండా ఉండాలి.

 

గర్భంతోవున్న సమయంలో చనుమొనలను వడివడిగా రుద్దుతూ వాటిని “గట్టిగా చేయాలని” ఒకప్పుడు డాక్టర్లు సలహా యిచ్చారు. పాలిచ్చే సమయంలో కురుపులు రాకుండా ఉండేందుకు యిలా సలహా యివ్వబడినప్పటికీ, యిలాంటి వ్యాయామాలు ఏమంత సహాయకరంగా ఉండవు. పాలు తాగే బాబును స్తనంవద్ద సరైన విధంగా పడుకోబెట్టనందువల్లే కురుపులు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: