సాదరణంగా ఆడవాళ్ళలో సెక్స్ అంటే భయం ఉంటుంది... పరిచయం లేని వ్యక్తిని పెళ్ళిచేసుకుని కాపురం చేయాలంటే ఎవరికన్నా మొహమాటమే.. అలాగే కొంతమంది స్త్రీ లలో భయంతో పాటు భర్తపై అనుమానం కూడా ఉంటుంది. పెళ్లికి ముందు ఎవరితోనైనా సంబంధం పెట్టుకున్నారేమో అని భయపడడం అలాగే మీ భార్య లేదా భర్తకు సుఖవ్యాధులున్నాయమోననే సందేహం రావడం, కలయిక వల్ల మళ్లీ మీకు కూడా ఆ వ్యాధి సోకుందనే భయం చాలా మందికి ఉంటుంది..

 

దీనివల్ల వాళ్ళు సెక్స్ పట్ల ఆసక్తి చూపరు. కానీ ఇది ఒకరకమైన జబ్బు అన్న విషయం వాళ్ళకి తెలియదు.. దీనినే "సిప్రిడోఫోబియా" అని అంటారు..కానీ ఈ వ్యాధి పేరు తెలియకపోవడంతో వారు దానికి గురయ్యారనే విషయం కూడా వారికి తెలియదు. ఈ వ్యాధి గురించి చాలా మందికి తెలియదు.సిప్రిడోఫోబియా వల్ల భార్య లేదా భర్తతో సెక్స్ లో పాల్గొనాలంటేనే భయం వేస్తూ ఉంటుంది. లైంగిక వ్యాధులు సోకుతాయని అనిపిస్తుంటుంది.

 

ఇలాంటి అనుమానాల వల్ల పెళ్లయిన తర్వాత సెక్స్ లో పాల్గొనాలంటే చాలా భయపడతారు. ఇలాంటి భయం ఎక్కువగా ఆడవారికే ఉంటుంది. దీంతో వారు పెళ్లయిన తర్వాత భర్తతో అంత త్వరగా సెక్స్ లో పాల్గొనరు.మనసులో బాధ పడి పోతు ఉంటారు.
చాలా మంది అమ్మాయిలకు వారు విన్న కొన్ని స్టోరీల వల్లగానీ, వారు చూసిన కొన్ని వీడియోల వల్లగానీ వారిలో సెక్స్ అంటే ఒక రకమైన భయం నెలకొని ఉంటుంది. 

 

సిప్రిడోఫోబియాతో ఇబ్బందులుపడేవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వారు ఎక్కువగా కంగారుపడుతుంటారు. గుండె దడ కూడా వారికి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా అనుమానాలు కలుగుతుంటాయి. సిప్రిడోఫోబియాకు చికిత్స ఒక్కటే. ఆలోచనల్లో మార్పురావాలి. ప్రవర్తన మారాలి.డాక్టర్ తో కౌన్సిలింగ్ ఇప్పించాలి..

 

కొన్ని మందులు కూడా వాడాలి.. యోగ, వ్యాయామం చేయడం లాంటివి చేయాలి. ఎక్కువగా భర్త తో మనసులోని అపోహల్ని, భయాన్ని, వెళ్లబుచ్చాలి.. సుఖవ్యాధులపట్ల అవగాహనా కలిగించాలి. వీలయితే సెక్సాలిజస్ట్ ని సంప్రదించాలి.. ఏది ఏమయినా భార్య భర్త ఇద్దరు ఒకరినొకరు అర్ధం చేసుకునేలా ఉండాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: