మటన్ ఫ్రై.. ఎంతమందికి తినాలి అనిపించదు చెప్పండి.. మాంసాహారులందరికి మటన్ ఫ్రై తినాలి అని ఉంటుంది. అయితే అలానే తింటారు కూడా. కానీ ఆంధ్ర మటన్ ఫ్రై చాలామంది తిని ఉండరు. ఈ మటన్ ఫ్రై ఎలా ఉంటుంది అంటే నోరు ఊరిపోతోంది. తినే కొద్దీ తినాలిఅనిపిస్తుంది . అంత అద్భుతంగా మటన్ ఫ్రై ఉంటుంది. అయితే అది ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకొండి.    

 

కావాల్సిన పదార్థాలు... 

 

మటన్‌ : కిలో,

 

మిరపపొడి : మూడుస్పూన్లు,

 

ధనియాల పొడి : ఒక స్పూను,

 

అల్లం వెల్లుల్లి పేస్ట్‌ : ఒక స్పూను,

 

కొబ్బరి పేస్ట్‌ : ఒక స్పూను,

 

గసగసాల పేస్ట్‌ : ఒక స్పూను,

 

పసుపు : ఒక స్పూను,

 

ఉప్పు : తగినంత,

 

మటన్‌ మసాలా పౌడర్‌ : రెండు స్పూన్లు,

 

కరివేపాకు : ఒక రెమ్మ,

 

ఉల్లిపాయలు : చిన్నవి రెండు (తరుగు),

 

పచ్చిమిరపకాయలు : ఆరు (తరుగు),

 

నీళ్లు : చిన్న కప్పు,

 

నూనె : ఐదు స్పూన్లు,

 

తయారీ విధానం... 

 

కుక్కర్‌ తీసుకుని అందులో కడిగిన మటన్‌తో పాటు కరివేపాకు, పైన చెప్పిన మసాల దినుసుల పొడులు, అల్లం వెల్లుల్లి పేస్టు.. అన్నీ వేసి కలపాలి. మూడు విజిల్స్‌ వచ్చే వరకు కుక్కర్‌లో ఉడికించాలి. ఆ తరువాత కుక్కర్‌ మూత తీసి నీళ్లు ఆవిరి అయ్యే వరకు స్టవ్‌ మీదే ఉంచాలి. మాడిపోకుండా బాగా కలుపుతుండాలి. పాన్‌ తీసుకుని నూనె వేసి ఉడికిన మటన్‌ మిశ్రమాన్ని అందులో వేయాలి. సన్నటి సెగ మీద పదిహేను నిమిషాలు ప్రై చేయాలి. కాస్త బంగారు వర్ణంలోకి వచ్చిన వెంటనే.. మటన్‌ మసాలా పౌడర్‌తో పాటు, కొత్తిమీర తరుగు, కాస్త ఉప్పు వేసి కలపాలి. ఐదు నిమిషాలయ్యాక దించేస్తే చాలు. నోరు ఊరించే ఆంధ్ర మటన్ ఫ్రై రెడీ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: