కోడి గుడ్డు బీరకాయ.. ఎంత రుచి.. ఎంత అద్భుతం అంటే.. అది మాటల్లో చెప్పలేనిది.. రుచిలో వర్ణించలేనిది.. అలాంటి కోడి గుడ్డు బీరకాయ ఎలా చెయ్యాలో తెలుసా ? ఎలా చేస్తే బాగుంటుందో అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి..

 

కావలసిన పదార్థాలు... 

 

కోడిగుడ్లు నాలుగు, 

 

ఉల్లి తరుగు-ముప్పావుకప్పు, 

 

లేత బీరకాయ ముక్కలు-రెండు కప్పులు, 

 

కరివేపాకు రెమ్మ-ఒకటి, 

 

పచ్చిమిర్చి నిలువుగా చీల్చి-ఒకటి, 

 

ఆవాలు-పావు టీస్పూన్‌, 

 

జీలకర్ర-అర టీస్పూన్‌, 

 

అల్లంవెల్లుల్లి పేస్ట్‌-ఒక టీస్పూన్‌, 

 

పసుపు-కొంచెం, 

 

ఉప్పు- రుచికి సరిపడా, 

 

కారం, గరం మసాలా పొడి-ఒక్కో టీస్పూన్‌, 

 

నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు.

 

తయారీ విధానం... 

 

పాన్‌లో నూనె వేడి చేసి కరివేపాకులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేగించాలి. అవి చిటపటమంటున్నప్పుడు ఉల్లి తరుగు వేసి ఉప్పు చల్లి ఉల్లి ముక్కలు రంగుమారేవరకు ఉంచాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి పచ్చి వాసన పోయేవరకు వేగించాలి. ఇందులో గుడ్లు వేసి రెండు నిమిషాలు వేగించి తీసి పక్కన పెట్టాలి. తరువాత బీరకాయ ముక్కలు వేసి ఉప్పు, పసుపు వేయాలి. మంట పెంచి మూడు నిమిషాలు వేగించాలి. మూతపెట్టి సన్నటి మంట మీద బీరకాయ ముక్కల్ని ఉడికించాలి. అవసరమనిపిస్తే కొన్ని నీళ్లు కలపాలి. కొన్ని బీరకాయల్లో నీళ్లు సరిగా ఉండవు అలాంటప్పుడు కాస్త ఎక్కువ నీళ్లు పట్టే అవకాశం ఉంది. ఇందులో వేగించిన గుడ్లు, కారం, మసాలాలు వేసి బాగా కలిపి సన్నటి మంట మీద ఏడు నిమిషాలు ఉంచాలి. అంతే.. బీరకాయ కూర రెడి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: