క్రీస్తు పూర్వం 48వ  సంవ‌త్స‌రంలో ఈజిప్టును ప‌రిపాలించిన  మ‌హారాణిగా క్లియోపాత్రాకు పేరుంది. రాజకీయ వ్యూహాలు రచించడంలో ఆమె సిద్ధహస్తురాలు. కొన్ని సార్లు ఆమె ఎత్తులకు చక్రవర్తులే చిత్తయిపోయిన రోజులున్నాయి.  ఆమె 69వ సంవత్సరంలో ఈజిప్టులోని అలెగ్జాండ్రియలో జన్మించింది. క్లియోపాత్రా టాలమీ వంశస్థురాలు. ఆమె కుటుంబం ఈజిప్టును సుమారుగా 400 ఏళ్ల పాటు పాలించినట్లు చరిత్ర చెబుతోంది. అయితే క్లియోపాత్రా సాధారణ మహారాణి కాదు. ఆమె గురించిన పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


 క్లియోపాత్రా గొప్ప అందగత్తె. ఆమె ముక్కు కొంచెం పొడవుగా ఉంటుంది. కానీ అది సరిగ్గా ఉంటే ఆమె అందం వర్ణించడానికి వీలు కాదని చరిత్ర చెబుతోంది. అందువల్లే ఆమెను ఎంతో మంది రాజులు కోరుకున్నారట. తన అంతఃపురంలో నిత్యం ఒక పురుషుడితో శృంగారంలో పాల్గొనేదట. అయితే ఆ మరుసటి రోజే ఆ పురుషున్ని ఉరి తీయించేదట. ఆ నిబంధనకు ఒప్పుకునే చాలా మంది ఆమెతో ఆ పని చేసేందుకు వెళ్లేవారట. అసలు పేరు క్లియోపాత్రా VII. ఆమె కన్నా ముందు 6 మంది క్లియోపాత్రాలు ఉండేవారు. చరిత్రలో ప్రాచుర్యం పొందింది మాత్రం క్లియోపాత్రా VII కావడం విశేషం.


 
క్లియోపాత్రా మహారాణి మాత్రమే కాదు. ఆమెకు పలు ఇతర రంగాల్లోనూ ప్రవేశం ఉంది. ఆమె ఒక గొప్ప రచయిత. బహుభాషా కోవిదురాలు. అప్పట్లోనే ఆమెకు 7కు పైగా భాషలు వచ్చట. కాస్మెటిక్స్ అనే ఓ వైద్యశాస్త్ర పుస్తకాన్ని ఆమె రచించింది. వెంట్రుకల సంరక్షణ పై అనేక చిట్కాలతో కూడిన మరొక పుస్తకాన్ని కూడా ఆమె రాసింది. ఆమెఎంతటి ఘ‌నికురాలంటే తన అధికారానికి అడ్డం వస్తున్నారనే నెపంతో సొంత చెల్లెలు, తమ్మున్నే హత్య చేయించింది.

 

 రోమన్ అయిన జూలియస్ సీజర్ ఈజిప్షియన్ అయిన క్లియోపాత్రాతో సహజీవనం చేయడం, పిల్లల్ని కనడం రోమన్లకు నచ్చలేదు. దీంతో సీజర్‌ను హతమారుస్తారు. అప్పుడు క్లియోపాత్రా రోమ్‌లోనే ఉంటుంది. క్లియోపాత్రా ఒకానొక సమయంలో నిరాదరణకు గురవడంతో ఆమె తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆమె అత్యంత ప్రమాదకరమైన విషం కలిగిన పాముతో తన వక్షోజాలకు కాటు వేయించుకుని చనిపోయింది. ఆమెతోపాటు ఆమె చెలికత్తెలు కూడా అలాగే ప్రాణాలు విడిచారు. అయితే ఈ విషయం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఆమెకు ఎవరో విషం ఇచ్చి చంపారని కొందరంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: