చింతకాయ కొబ్బరి చట్నీ ఎంత రుచిగా ఉంటుందో తెలుసా ? అలాంటి ఈ చింతకాయ కొబ్బరి చట్నీని ఎలా చేసుకోవాలో ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

కావాల్సిన పదార్థాలు...  

 

చింతకాయముక్కలు - అర కప్పు, 

 

కొబ్బరి కాయ - ఒకటి, 

 

పచ్చిమిరపకాయలు - ఆరు, 

 

పుట్నాలు - ఒక టేబుల్‌ స్పూను, 

 

ఆవాలు - అర టీ స్పూను, 

 

జీలకర్ర - అర టీ స్పూను, 

 

కరివేపాకు - రెండు రెబ్బలు, 

 

ఎండు మిరపకాయలు - నాలుగు, 

 

ఉప్పు - తగినంత, 

 

నూనె - సరిపడేంత.

 

తయారీ విధానం... 

 

ముందుగా చింతకాయలపై పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. కొబ్బరిని కూడా ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఇప్పుడు రోట్లో చింతకాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, పుట్నాలు, ఉప్పు, పసుపు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత స్టౌ మీద గిన్నె పెట్టి నూనె కొద్దిగా వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి రుబ్బిన పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: