ఇంకో నెల పోతే చలికాలం ముగుస్తుంది.. అలాంటి ఈ కాలంలో ఎంత వేడి పదార్థాలు తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది. అయితే అలా వేడి వేడిగా తినాల్సిన వాటిలో మష్రూమ్ సూప్ కూడా ఒకటి. అది ఏంటంటే.. మష్రూమ్ సూప్.. ఒక్క మష్రూమ్ సూప్‌ అనే కాదు.. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏ సూప్ అయినా సరే ఈ చలికాలంలో తీసుకుంటే అదిరిపోతుంది. అయితే ప్రస్తుతం ఈ ముష్రూమ్ సూప్‌ ఎలా చెయ్యాలి అనేది తెలుసుకుందాం.

 

ముష్రూమ్ సూప్ కి కావాల్సిన పదార్ధాలు.. 

 

బటన్‌ మష్రూమ్స్‌- కప్పు, 

 

ఆలివ్‌ ఆయిల్‌- టేబుల్‌ స్పూన్‌, 

 

బట్టర్‌ - టేబుల్‌స్పూన్‌, 

 

తరిగిన అల్లం- టేబుల్‌ స్పూన్‌, 

 

సన్నగా తరిగిన ఉల్లిపాయ

 

మైదాపిండి- ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌,

 

పాలు - ఒకటిన్నర కప్పు, 

 

ముప్పావు కప్పు- ఫ్రెష్‌క్రీమ్‌. 

 

ఉప్పు- తగినంత 

 

తయారీ విధానం..  

 

ఓ పాన్‌లో ఆలివ్‌ ఆయిల్‌, బట్టర్‌ను వేడి చేసి తరిగిన అల్లం వేసి బాగా కలపాలి. ఆతరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేదాకా వేగించాలి. వాము ఆకులు, మైదా పిండి వేసి బాగా కలిపి నిమిషం పాటు వేగించాలి. బటన్‌ మష్రూమ్స్‌, ఉప్పు వేసి మిక్స్‌ చేసి 5 నుంచి 6 నిమిషాలు ఉడికించాలి. మరిన్ని మష్రూమ్స్‌ వేసి, తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి కొద్దిసేపు మంటపై ఉంచాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేడిచేసి, పాలు పోసి 2నిమిషాలు మంటపై ఉంచాలి. అంతే మష్రూమ్ సూప్ రెడీ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: