సగ్గుబియ్యం.. వీటితో చిరు తిళ్ళు చేసుకోవచ్చు అని చాలామందికి తెలియదు. ఎందుకంటే ఎవరికి దీనిపై అంత అవగాహనా లేదు. ఇంకా అలాంటి అద్భుతమైన సగ్గుబియ్యంతో పకోడీ తెలిస్తే ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అలాంటి సగ్గు బియ్యంతో చేసే పకోడీని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి అలాంటి సగ్గుబియ్యం పకోడీ ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.  

 

IHG

 

సగ్గుబియ్యం పకోడీ కావాల్సిన పదార్ధాలు..

 

సన్న సగ్గుబియ్యం, 

 

చిక్కని పెరుగు, 

 

బొంబాయి రవ్వ, 

 

బియ్యప్పిండి - అరకప్పు చొప్పున, 

 

ఉల్లిపాయలు (పెద్దవి) - 2, 

 

అల్లం తురుము - 2 చెంచాలు, 

 

పచ్చిమిర్చి తురుము - 4 చెంచాలు, 

 

ఉప్పు- రుచికి సరిపడా, 

 

నూనె - వేయించడానికి సరిపడా

 

తయారీ విధానం.. 

 

IHG

 

ముందుగా గిలకొట్టిన పెరుగులో సగ్గు బియ్యాన్ని 5 గంటల పాటు నానబెట్టాలి. ఆ సగ్గుబియ్యం బాగా నానినా తర్వాత బియ్యప్పిండి, బొంబాయిరవ్వలో వాటిని కలిపి, ఆపై.. సన్నగా, పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి తురుము, ఉప్పు వేసి పకోడీ పిండిలా కలుపుకోవాలి. అవసరాన్నిబట్టి ఇంకా పెరుగూ కలుపుకోవచ్చు. ఆ తర్వాత.. మూకుడులో నూనె పోసి బాగా కాగిన తర్వాత ఆ పిండిని పకోడీల మాదిరిగా వేసి మంచి రంగు వచ్చేవరకు వేయించి పల్లీల చట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటాయి. మరి ఇంకేందుకు ఆలస్యం వెంటనే ఇంట్లో ఉండే వాటితో ఒకసారి ప్రయత్నించి చుడండి.       

మరింత సమాచారం తెలుసుకోండి: