ఆన్‌లైన్ అమ్మ‌కాల ట్రెండ్ కొత్త పుంత‌లు తొక్కుతోంది. ముందు సెకాండాండ్‌ వ‌స్తువుల అమ్మ‌కాల‌కే ప‌రిమిత‌మైన ఆన్‌లైన్ అమ్మ‌కాలు, త‌ర్వాత బండ్లు, కార్లు, గ్రోస‌రీస్ ఇలా అనేక రంగాల్లో అమ్మ‌కాలు సాగిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి మ‌నుషుల అమ్మకాలు, అదీ క‌ట్టుకున్న భార్య‌ల‌ను అమ్ముకునే ద‌శ‌కు చేరుకున్నాయి. 

భార‌త‌దేశంలో భార్యా భ‌ర్త‌ల బంధం ఎంతో ప‌విత్ర‌మైంది. ఇది ఎవ్వ‌రు కాద‌న‌లేని స‌త్యం. కానీ విదేశాల్లో అలా కాదు. వారి క‌ల్చ‌ర్ మ‌న‌కు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అనుంబంధాలు, ఆత్మీయ‌త‌ల‌కు అంత‌గా విలువ‌నివ్వ‌రు. అయితే ఇప్పుడు ఈ బంధాలు మ‌రింత దిగ‌జారి పోతున్నాయి. అందుకు ఇప్పుడు మీరు చ‌ద‌వ‌బోయే వార్తే నిద‌ర్శ‌నం. ప్రేమించి పెళ్లాడిని భార్య అతిగా న‌వ్వుతుందంటూ ఏకంగా ఆన్‌లైన్‌లోనే అమ్మ‌కానికి పెట్టాడో ప్ర‌భుద్దుడు. ఈఫోటోలో క‌నిపిస్తున్న ఇత‌గాడి పేరు జోకెర్ సిమ‌న్‌. ఆయ‌న ప‌క్క‌నే అందంగా న‌వ్వుతున్నది సిమ‌న్ భార్య‌. పేరు లీండ్రా. వీరిద్ద‌రు ఎంతో అన్యోన్యంగా కాపురం చేసి ఇద్ద‌రు పిల్ల‌ల‌ను కూడా క‌న్నారు. అయితే ఎందుకో గాని ఈ మ‌ధ్య‌న మ‌నోడికి భార్య అంటే విర‌క్తి ప్రారంభ‌మైంది. ఇంకేముందు ఇన్నాళ్లు ప్రేమ‌గా చూసుకున్న భార్య‌నే ఈబేలో అమ్మకానికి పెట్టేశాడు. 


ఈ ఫోటోలో చిద్విలాసంగా న‌వ్వుతూ ఎంతో అందంగా.. అన్యోన్యంగా ఉన్నట్లుగా కనిపిస్తున్న ఈ ఫోటోను పోస్ట్ చేసిన సదరు వ్యక్తి.. తన భార్యకు సంబంధించిన ప‌లు విష‌యాల‌ను ఆన్‌లైన్‌లో ఏ క‌రువు పెట్టాడు. తన భార్యను సొంతం చేసుకున్నోడు ఎంతో అదృష్టవంతుడిగా పేర్కొన్న ఇతడి పోస్టు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. త‌న భార్య లీండ్రాకు దైవభక్తి అన్నది అస్సలు లేదని.. తనకు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఏ మాత్రం పూజలు చేయలేదని చెప్పుకొచ్చాడు. 33 ఏళ్ల సిమన్ కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన భార్య తన చేతలతో.. మాటలతో హింసిస్తోందని.. అందుకే ఆమెను అమ్మేయాలని తాను అనుకున్నట్లుగా వెల్లడించాడు. తన భార్య లీండ్రా బాగా నవ్వుతుందని.. లొడలొడా మాట్లాడుతుంటుందని చెప్పారు. అదేవిధంగా త‌న భార్య మంచి బాడీ వర్క్‌తో.. చక్కటి షేప్‌తో ఎంతో అందంగా ఉంటుంద‌ని ప్ర‌క‌టించాడు సిమ‌న్‌. అంతే కాదండోయ్ తన భార్య వంటపని అద్భుతంగా చేస్తుందని ఊరించాడు.


ఫర్ సేల్ వన్ వైఫ్ అంటూ లీండ్రా గురించి ఆన్‌లైన్‌లో ప్ర‌క‌ట‌న‌లిచ్చాడు. తన భార్యను దక్కించుకున్నోడు ఎంతో లక్కీగా అభివర్ణించాడు. కండిష‌న్స్ అప్లై అంటూ.. నాట్ రిఫండ‌బుల్ అని కూడా అందులో స్ప‌ష్టం చేశాడు. ఈబేలో ఈ ప్ర‌క‌ట‌న‌ను చూసిన ఎంతోమంది ఔత్సాహికులు ఆమెను సొంతం చేసుకునేందుకు పోటీ ప‌డుతున్నారు. రెండు రోజుల వ్యవధిలోనే 65880 పౌండ్ల బిడ్లు వచ్చాయి. తన భర్త చేసిన ఘనకార్యం గురించి తెలిసిన లీండ్రా అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఇన్నాళ్లు న‌వ్వుతూ ఉన్న ఆమె ముఖంలో ఈ ప్ర‌క‌ట‌న చూసిన త‌ర్వాత న‌వ్వ‌న్న‌దే క‌నిపించ‌కుండ పోయింద‌ట‌.



మరింత సమాచారం తెలుసుకోండి: