కావాల్సిన పదార్ధాలు  చికెన్ 700 గ్రా. సాల్ట్ 1 స్పూన్  వెల్లుల్లి రెబ్బలు 3  నూనె 2 స్పూన్లు  ధనియాల పొడి రెండు స్పూన్లు  కారంపొడి 1స్పూన్  పసుపు చిటికెడు  నిమ్మకాయ రసం 4స్పూన్లు  తరిగిన కొత్తమీర 2 స్పూన్లు  తయారు చేసే విధానం చికెన్ ని బాగా కడిగి, తడి లేకుండా తుడిచి పొడిగా ఆరబెట్టాలి. చిన్నముక్కలుగా తరగాలి. ఉప్పు, వెల్లుల్లి ముక్కలు వేసి బాగా కలపాలి.

నాన్ స్టిక్ పాన్ లో నూనె వేసి ఈ ముక్కలను వేసి వేయించాలి. చికెన్ ను వేసి కాసేపు మగ్గనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, పసుపు, కారం వేసి బాగా కలపాలి. బాగా మెత్తబడేవరకూ వేయిస్తూ ఉండాలి. నిమ్మరసం, కొత్తిమీర ఆకులు పైన వేయాలి. ఈ చాట్ లో ఉల్లిపాయ చక్రాలు, నిమ్మముక్కలు కుకుంబర్ పీసెస్ తో అలంకరించాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: