చాలా మంది చూడ్డానికి చాలా అందంగా క‌న‌బ‌డ‌తారు. కాని పైనుండి క్రింద వరకూ చాలా చక్కగా శరీర ఆకృతి, శరీర ఛాయ ఆకర్షనీయంగా ఉంటాయి. అయితే పాదాల విషయానికొస్తే మాత్రం అక్కడ చిన్న లోపం కనిపిస్తుంది. నిండు చందమామలో నల్ల మచ్చలా. దాంతో సిగ్గు, బిడియం చోటు చేసుకుంటుంది. పాదాలు పగుళ్ళతో కాళ్ళు అందవిహీనంగా ఉంటాయి. అందుకు కొన్ని బలమైన కారణలు ఉంటాయి. అవి శరీరములో అధిక వేడి, పొడి చర్మం, ఎక్కువ సేపు నిలబడి పనిచేయువారికి సాదారణంగా వస్తుంటాయి. కఠిన నేలపై నడవడం కూడా ఒక కారణమే. ఎత్తైన చెప్పులు ధరించి నడవడంతో పాదల వద్ద రక్తప్రసరణ సరిగా జరగదు.

అలాగే అధిక బరువు కలిగిఉండడం, పాదాల మీద శ్రద్ద తీసుకోకపోవడం, పోషకాహార లోపము పాదాల పగుళ్ళకు కారణమౌతున్నాయి.అలాంటి పగిలిన పాదాలను సాక్సులతో ఎన్ని రోజులని కవర్ చేస్తారు? అంతే కాదు, పగిలిన పాదాలు అనారోగ్యానికి సూచన అని కూడా అంటారు. . అలాంటివారు హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వట్లేదని , పాదాల కోసం సరైన జాగ్రత్తలు తీసుకోలేదాని తెలుస్తుంది. డ్రైస్కిన్, ఎక్కువగా నడవడం లేదా పరుగు, సరైన షూలు ధరించకపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఊబకాయం, సరైన శుభ్రత పాటించకపోవడం ఇవన్నీ కాళ్ళ పగుళ్ళకు కారణాలు. కాళ్ల పగుళ్ళకు వెంటనే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే, పరిస్థితి మరింత ఎక్కువ అవుతుంది. దానికి వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవల్సి ఉంటుంది.

పగిలిన పాదాలను నివారించుకోవడం కోసం నేచురల్ రెమెడీ గ్రేట్ గా పనిచేస్తుంది, హో మేడ్ ఓట్ మీల్ లెమన్ స్ర్కబ్ పగిలిన పాదాలను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది,.  2టేబుల్ స్పూన్లు నిమ్మరసం :1 టేబుల్ స్పూన్ ఉప్పు 2 టీస్పూన్లు నిమ్మ, ఓట్ మీల్ కాంబినేషన్ స్ర్కబ్ పాదాల పగుళ్ళను అద్భుతంగా నివారిస్తుంది. అందుకు ఇది ఒక ఎక్సలెంట్ నేచురల్ రెమెడీ . ఈ మిశ్రమంతో పాదాల మీద స్క్రబ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ లెవల్స్ నివారిస్తుంది . ఈ హోమ్‌ రెమెడీ ఉపయోగపడుతుంది . నిమ్మరసం నేచురల్ క్లెన్సర్ గా పనిచేస్తుంది,. పాదాల్లో మురికి తొలగిస్తుంది, పాదాల పగుళ్ళు ను నివారిస్తుంది . పాదాల్లో ఇన్ఫెక్షన్ నివారిస్తుంది. పాదాల పగుళ్ళును చాలా ఫాస్ట్ గా నివారిస్తుంది. పైన సూచించిన విధంగా పదార్థాలను ఒక బౌల్లోకి తీసుకుని , అన్నింటిని బాగా మిక్స్ చేయాలి . తర్వాత పాదాలను గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి 15 రోజులు అలాగే వదిలేసి, తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. 10 నిముషాలు గోరువెచ్చని నీటితోపాదాలను డిప్ చేసి స్క్రబ్ చేయాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: