Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 5:35 am IST

Menu &Sections

Search

ఆనియన్ చీజీ రింగ్స్ ని ఎప్పుడైనా తిన్నారా..?

 ఆనియన్ చీజీ రింగ్స్ ని ఎప్పుడైనా తిన్నారా..?
ఆనియన్ చీజీ రింగ్స్ ని ఎప్పుడైనా తిన్నారా..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఆనియన్ చీజీ రింగ్స్ గురించి ఎప్పుడైనా విన్నారా.? ఇప్పుడు మనం ఒక కొత్త రకమైన స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్న స్నాక్స్ "ఆనియన్ చీజీ రింగ్స్". ఈ స్నాక్స్ ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి చీజ్ అంటే చాలా ఇష్టం. పిల్లలే కాదు పెద్దవారు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఉన్న జనరేషన్ ప్రకారం అందరూ బయట ఫుడ్ కే ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తున్నారు. పిల్లలు కూడా ఫాస్ట్ ఫుడ్ కే ఎక్కువ అలవాటు పడుతున్నారు. ఇప్పుడు ఈ స్నాక్స్ కి కావాల్సిన పదార్ధాలు మరియు తయారీ విధానం ఎలాగనో చూద్దాం.

ముందుగా "ఆనియన్ చీజీ రింగ్స్" కి కావాల్సిన పదార్ధాలు:

ఆనియన్-4,
మోజారిల్లా చీజ్-కొద్దిగ,
ఎగ్స్-4,
బ్రెడ్ క్రమ్స్-కొద్దిగ,
మైదా-కొద్దిగ,
నూనె-డీప్ ఫ్రైకి సరిపడా,
"ఆనియన్ చీజీ రింగ్స్"తయారు చేసే విధానం:

ముందుగా ఉల్లిపాయలను పొట్టు తీసి వాటిని గుండ్రంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మోజారిల్లా చీజ్ తీసుకుని సన్నగ పొడగ్గా కట్ చేసుకోవాలి. ముందుగా గుండ్రంగా కట్ చేసి పెట్టుకున్న  ఉల్లిపాయలను తీసుకుని వాటిని వేరు చేసి, ముందు పెద్ద ఉల్లిపాయ రింగ్ పెట్టి దానిలో చిన్న ఉల్లిపాయ రింగ్ ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న వాటి రెండిటి మధ్యలో మోజారిల్లా చీజ్ ని పెట్టుకుని ఒక గంట ఫ్రిజ్ లో ఉంచాలి.

ఇప్పుడు గుడ్లను ఒక గిన్నెలో పగల గొట్టి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నెలో బ్రెడ్ క్రమ్స్ ను ఇంకొక దాంట్లో మైదాని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. గంట తరువాత ఉల్లిపాయ రింగ్స్ ని ఫ్రిజ్ లో నుంచి తీసి, మొదట మైదాలో ముంచుకోవాలి. తరువాత గుడ్డు మిశ్రమంలో ముంచుకోవాలి. తరువాత మళ్లీ బ్రెడ్ క్రమ్స్ లో ముంచుకోవాలి. మళ్లీ గుడ్డు మిశ్రమంలో ముంచుకుని మళ్లీ దాని బ్రెడ్ క్రమ్స్ లో ముంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి, ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి, నూనె వేడి అయ్యాక మనం చేసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ ని వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంతవరుకు ఫ్రై చేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన "ఆనియన్ చీజీ రింగ్స్" రెడీ


mozzarella
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.