సస్పెన్స్, థ్రిల్లర్ సినిమా చూపిస్తున్న శ్రీరెడ్డి..!
శ్రీరెడ్డి.. టాలీవుడ్ లో ఓ సంచలనం. సినిమా ఇండస్ట్రీలోని పలు అంశాలపై ఆమె ఉద్యమిస్తోంది. ఆమె ఉద్యమానికి ఇటీవలే పలువురు మద్దతు పలికారు. దీంతో ఆమె ఓ రేంజ్ కు వెళ్లిపోయింది. అయితే ఆమె ఉద్యమంలో క్లారిటీ కొరవడినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఆమె కథ రోజుకో మలుపు తిరుగుతూ ఏ తీరం చేరుతుందోననే ఉత్కంఠ మొదలైంది.