ఏపీ సీఎం జగన్ తాడేపల్లిలోని నివాసంలోఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడే ఆయన క్యాంపు కార్యాలయం కూడా ఉంది. ఇటీవల ఆయన నివాసానికి, క్యాంపు కార్యాలయానికి సంబంధించి వివిధ పనుల కోసం ఏపీ సర్కారు నిధులు విడుదల చేసింది. తాడేపల్లిలోని నివాసాలే కాకుండా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసంలోనూ కొన్ని పనుల కోసం నిధులు విడుదల చేసింది.
దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. టీడీపీ నేతలు లోకేశ్ వంటి వారు ట్వీట్లతో ఏకేశారు. మిగిలిన పార్టీల నాయకులూ విమర్శించారు.
అయితే ముఖ్యమంత్రి అన్నాక కొన్ని భద్రతాపరమైన ఏర్పాట్లు ఉంటాయి