తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. గత కొంతకాలంగా..ముఖ్యమంత్రి కేసీఆర్ తొలగించబోయే మంత్రుల జాబితా ఇదేనంటూ ప్రచారం జరగడం...అందులో మంత్రి మల్లారెడ్డి పేరు వినిపించడం...అయితే, ఇటీవల ఓ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత తనయుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై మల్లారెడ్డి బహిరంగ సభ వేదికగా ప్రశంసలు కురిపించి తన పదవి కాపాడుకునే ప్రయత్నం చేయడం....రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే, తాజాగా ఆయన మరో వివాదంలో ఇరుక్కున