గత రెండు నెలలుగా లాక్ డౌన్ కారణంగా ఎలాంటి కొత్త వాహనాలు కొనాలన్నా వాహనదారులు చాలా ఇబ్బందులు పడ్డారు.  మార్కెటింగ్ వ్యవస్థ పూర్తిగా బంద్ చేయడంతో కొత్త వాహనాల కొనుగోలు పూర్తిగా తగ్గిపోయింది. ఈ మద్య లాక్ డౌన్ సడలించిన తర్వాత వాహనాల అమ్మకాలు మళ్లీ జోరందుకున్నాయి. టూ వీలర్ లేదా ఫోర్ వీలర్ కొనాలనుకునేవారికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) శుభవార్త అందించింది.  ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ తాజా నిర్ణయం తో  కార్లు,  బైక్ ల ధరలు తగ్గనున్నాయి. లాంగ్ టర్మ్ మోటార్ ఇన్సూరెన్స్ పాలసీలను ఉపసంహరిస్తున్నట్లు ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ సంస్థ ప్రకటించింది. దీంతో వాహనదారులు తగ్గిపోనున్నాయి. ఐఆర్‌డీఏఐ తాజాగా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. 

 

ఇక  ఈ నిబంధనల ప్రకారం కొత్త టూవీలర్లు, ఫోర్ వీలర్లకు ఇక 3, 5 సంవత్సరాల కాల పరిమితిలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, ఓన్ డ్యామేజ్ లాంగ్ టర్మ్ పాలసీలను నిలిపివేయనున్నాయి. అయితే వాహన తయారీదారులు, కార్ల కొనుగోలుదారులకు ఉత్సాహాన్ని కలిగించే విషయాలలో, దీర్ఘకాలిక మోటారు భీమా పాలసీ సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు  ఐఆర్‌డీఏఐ తెలిపింది.

 

ఆగస్టు 1వ తేదీ నుంచి  ఈ నిబంధన అమల్లోకి రానున్నదని ఐఆర్‌డిఎఐ ఓ సర్క్యులర్‌లో పేర్కొన్నది.  వినియోగదారుల్లో నెలకొని ఉన్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొ న్నది. ఆర్ధిక విశ్లేషకుల అంచనా మేరకు టూ వీలర్స్ , కార్ల ఆన్-రోడ్ ధర  తగ్గుతున్నందున ఈ చర్య వాహనాల డిమాండ్ పెంచడానికి సహాయపడుతుందని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: