ఏప్రిల్ 1 నుంచి భారతదేశంలో BS 4 వాహనాలు నిలిపివేస్తున్న తరుణంలో సంస్థలన్నీ కొత్త కాలుష్య నివారణ ప్రమాణాలకు అనుగుణంగా వారికి బైక్స్, కార్లని మార్పులు చేసి bs-6 ప్రమాణాలకు తగ్గట్టుగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. భారతదేశంలో ముఖ్యంగా మధ్యతరగతి వారు ఉపయోగించే టూ వీలర్స్ అధికంగా bs6 ఫార్మెట్లోకి అప్డేట్ చేస్తున్నాయి ప్రతి కంపెనీ. అంతేకాదు ఆటో మొబైల్ అన్ని సంస్థలు కూడా ఇప్పటికే అన్ని మోడల్స్ ను bs6 ఫార్మెట్లోకి అప్డేట్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేసేసాయి. మరికొన్ని విడుదల చేయాల్సి ఉంది. కరోనా కారణంగా వాటి లాంచ్ కాస్త నిదానంగా జరుగుతోంది.

 

 

అయితే బిఎస్ 4 ధరలతో పోలిస్తే bs6 మోటర్ సైకిల్ ధర వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఏకంగా బైక్స్ లో ఐతే 3000 - 15000 వరకు వ్యత్యాసాలు ఉన్నాయి. అలాగే కార్స్ లో చూస్తే 15000 - 60000 వరకు వ్యత్యాసం కనపడుతుంది. కాలుష్య నివారణ నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా కేవలం ఇంజన్ ఒక్కటే అప్డేట్ చేసినప్పటికీ ధరలు మాత్రం దాదాపు అన్ని బైక్స్ చాలావరకు పెంచాయి సంస్థలు. ఇప్పుడు ప్రజలకి బిఎస్ 6 అప్డేట్ చేసిన తర్వాత అతి తక్కువ ధరలో మంచి బైక్స్ ను ఎంచుకోవడంలో తలమునకలయ్యారు కస్టమర్లు.

 


ఇక దీనికోసమే బీఎస్-6 మోటార్ సైకిల్స్ లో చౌకగా దొరికే వారి కోసం ఎదురు చూస్తున్నారు అనేకమంది. అలాగే భారత మార్కెట్లో ఉండే ఆటో దిగ్గజం సంస్థలైన హీరో, హోండా, టీవీఎస్, బజాజ్ వంటి ద్విచక్ర వాహన సంస్థలు bs6 బైక్స్ ను అతి తక్కువ ధరలకే మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇకపోతే ప్రస్తుతం భారత మార్కెట్లో కొన్ని బైక్స్ మాత్రమే తక్కువ ధరకే లభిస్తున్నాయి ఇక వాటి వివరాల్లోకి వెళితే... బీఎస్6 హీరో హెచ్ఎఫ్ డీలక్స్, బీఎస్6 హీరో స్ప్లెండర్ ప్లస్, ​బీఎస్6 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్, బీఎస్6 హీరో స్ప్లెండర్ ఐస్మార్ట్, బీఎస్6 హోండా షైన్ అందుబాటులో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: