దేశంలో కరోనా విలయతడవం చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే గత నాలుగు నెలలు లాక్ డౌన్ విధించడం వలన కరోనా ప్రభావం అన్ని రంగాలపై పడింది. కరోనా కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయారు. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇల్లు గడవడానికి కష్టంగా మారింది. అయితే ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి కొన్ని వాహన సంస్థలు భారీ డిస్కకౌంట్ తో కనుగోలు చేశారు. అయితే తాజాగా కొత్తగా కారు లేదా టూవీలర్ కొనుగోలు చేశారా అయితే మీకు ఝలక్. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మార్చి 27న ఇచ్చిన ఆర్డర్లను వెనక్కి తీసుకుందని తెలియజేశారు. దీంతో మార్చి 31 తర్వాత కొనుగోలు చేసిన బీఎస్ 4 వాహనాలను రిజిస్టర్ చేసుకోవడం వీలు కాదని తెలియజేశారు.

 

 

అయితే ఆటోమొబైల్ కంపెనీలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా.. అత్యాశకు పోయాయని సుప్రీం కోర్టు అభిప్రాయపడిందని తెలిపారు. అందుకే మార్చి 27న ఇచ్చిన ఆర్డర్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిందని సమాచారం. తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసిందని తెలియజేశారు.

 

 

అయితే సుప్రీంకోర్టు నిర్ణయంతో మార్చి 31 తర్వాత కొనుగోలు చేసిన బీఎస్ 4 వాహనాలు రిజిస్ట్రేషన్ ఇక నిలిచిపోనుందన్నారు. ఒకవేళ మార్చి 31 కన్నా ముందు వాహనాన్ని కొనుగోలు చేసి ఉంటే అప్పుడు వెహికల్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని తెలిపారు. అదే డీలర్ వాహన కొనుగోలు అంశాన్ని వాహన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయకపోతే ఆ వాహన కొనుగోలు కూడా పరిగణలోకి రాదన్నారు. అయితే సుప్రీంకోర్టు మార్చి 27న ఆటోమొబైల్ కంపెనీలకు బీఎస్ 4 వాహనాల విక్రయానికి 10 రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రకటించిందని సమాచారం. అలాగే 1,05,000 వాహనాలను మాత్రమే విక్రయించాలని ఆదేశించిందన్నారు. అయితే ఆటోమొబైల్ కంపెనీలు మాత్రం 10 రోజుల్లో 2,55,000 వాహనాలను విక్రయించాయని తెలిపారు. దీంతో సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మార్చి 27 ఆర్డర్లను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలియజేసిందని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: