ప్రస్తుతం సమాజంలో వాహనాల వాడకం ఎక్కువగా ఉంది. అయితే  ప్రస్తుతం బీఎస్4 నుంచి బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా టూ-వీలర్లను వాహన సంస్థలు మారుస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో విడుదలైన 2020 టీవీఎస్ జూపిటర్ స్కూటర్ తో బీఎస్6 పార్మాట్లో వాహనాలను లాంచ్ చేయడం మొదలు పెట్టింది టీవీఎస్ సంస్థ. ఈ సరికొత్త 2020 టీవీఎస్ జూపిటర్ స్కూటర్లో పొందుపరిచారు. ఎక్స్ షోరూంలో బీఎస్6 జూపిటర్ ధర వచ్చేసి రూ.61,449 నుంచి రూ.67,911 మధ్య ఉంది.

 

 

ఆరో తరానికి చెందిన హోండా యాక్టివా భారత్ లో అత్యంత విజయవంతమై మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది. బీఎస్6 హోండా యాక్టివా 6జీ స్కూటర్లో ఏసీజీ సైలెంట్ స్టార్ట్ సిస్టం, ఇన్హీబీటర్ సేఫ్టీ ప్రొవిజన్ సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఫంక్షనల్ ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్ లాంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయన్నారు. బీఎస్6 హోండా యాక్టివా 6జీ ధర వచ్చేసి రూ.63,912 నుంచి రూ.65,412 మధ్య ఉంటుంది.

 

 

ఈ సరికొత్త స్కూటర్ తో బీఎస్6 ఫార్మాట్లో వాహనాలను అప్ డేట్ చేయడం మొదలుపెట్టింది సుజుకీ సంస్థ.  బీఎస్6 సుజుకీ యాసెస్ 125 మోడల్.. 124 సీసీ ఇంజిన్ ను కలిగి ఉండి 9 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 10 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్ షోరూంలో బీఎస్6 సుజుకీ యాసెస్ 125 ధర వచ్చేసి రూ.64,800 నుంచి రూ.69,500 మధ్య నిర్దేశించారు.

 

 

బీఎస్6 స్కూటర్లలో అత్యంత అందుబాటులో ధరలో దొరుకుతున్న స్కూటర్ హీరో ప్లెజర్ ప్లస్ మోడల్. బీఎస్4 మోడల్ తో పోలిస్తో ఈ నూతన ఫార్మాట్లో ప్లెజర్ ప్లస్ స్కూటర్లో పెద్ద మార్పులేమి లేవు. 110 సీసీ ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ స్కూటర్ 8 బీహెచ్ పీ బ్రేక్ హార్స్ పవర్, 9 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎక్స్ షోరూంలో బీఎస్6 హీరో ప్లెజర్ ప్లస్ ధర రూ.54,800 నుంచి 56,800 వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: