సన్నగా తురిమిన కీరకాయలో పాలపొడి కలిపిన మిశ్రమాన్ని కళ్ల మీదపెట్టుకుంటే కళ్ళ అలసట పోయి ఉత్తేజమవుతాయి. కీరదోసకాయ ముక్కలను కళ్ళపై కాసేపు ఉంచితే భారం తగ్గినట్లుంటుంది. కళ్ళకింద నల్లటి వలయాలు పోవాలంటే కోడిగుడ్డులోని తెల్లసొనను పట్టించి ఆరిన తరువాత చన్నీటితో కడగాలి. పన్నీరు, పాలు, కలబంద రసంలో దూదిని ముంచి కళ్లమీద పెట్టుకుని 10 నిమిషాలసేపు ఉంచుకుంటే కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లని వలయాలు పోతాయి. కళ్లు అలసట నుంచి ఉపశమనం పొందుతాయి. అర టీ స్పూన్ సోంపును ఒక కప్పు నీటితో కలిపి వేడిచేసి సగం అయ్యేవరకు మరగనివ్వాలి. చల్లారనిచ్చి ఆ నీటిని ఐ డ్రాప్స్ గా ఉపయోగిస్తే కళ్లు మిలమిలా మెరుస్తాయి. నిద్రలేమితో బాధపడుతుంటే ఉపశమనం కోసం మూడు చుక్కల పన్నీటిని కళ్ళలో వేసుకోవాలి. కళ్ళలో ఇసుక రేణువైనా, నలకైనా పడితే నాలుగైదు చుక్కల పాలను కంట్లో వేసుకొని తలను ప్రక్కకు వాల్చి పడుకుంటే నలకలు బయటికి వస్తాయి. కళ్ళనీళ్లు కారకుండా వుండాలంటే నీరు కారిపప్పుడు దూదిని ఉప్పునీటిలో ముంచి రెప్పలపై వుంచండి. అలసట తీరి నేత్రాలు హాయిగా ఉంటాయి. మైగ్రెయిన్ తలనొప్పితో బాధపడేవారు మెత్తగా పొడిచేసిన వామును శుభ్రమయిన బట్టలో వేసి తరచు వాసన పీలుస్తుంటే ఉపశమనం లభిస్తుంది. కళ్ళకు అలసట కలిగినపుడు కంటిపైన కొబ్బరినూనె రాసుకుంటే అలసట తీరుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: