ఈ మద్య దేశంలో ఎక్కువగా పొల్యూషన్ మొదలైంది.  దాంతో శరీరం, జుట్టు పై ఎక్కువ శ్రద్ద చూపించాల్సి వస్తుంది. వర్క్ టెన్షన్లు, విశ్రాంతి లేకపోవడం, తీసుకునే ఆహారం వలన జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా జుట్టు రాలే సమస్య నుండి పూర్తిగా బయటపడవచ్చు.  ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ , తలలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది.

 

తద్వారా తలలో మూసుకుపోయిన రంద్రాలు తిరిగి తెరవబడతాయి. ఉల్లిపాయ రసం తలకు అప్లై చేయడం వల్ల , జుట్టు బలంగా పెరుగుతుంది.జుట్టు లో ఉన్న ఫంగస్ ని హరింపచేసి చుండ్రును నివారిస్తుంది. తెల్లజుట్టు నల్లగా మారుతుంది.ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. వారంలో 3 సార్లు ఉల్లిరసం తలకు పట్టిస్తే , రెండు నెలల్లో కొత్త జుట్టు రావడం గమనిస్తారు.

 

 ఉల్లిపాయలను బాగా మెత్తగా గ్రైండ్ చేసి, ఒక బట్టలో తీసుకొని పిండితే రసం వస్తుంది.  ఈ రసాన్ని తలకు పట్టించి , మృదువుగా ఒక 5 నిముషాలు మసాజ్ చేయాలి. 45 నిముషాలు వెయిట్ చేసి , గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి.

 

ఉల్లిపాయ రసం పుష్కలంగా 'క్యాటలైజ్' ఎంజైమ్'లను కలిగి ఉంటుంది మరియు దీన్ని చాలా సంవత్సరాలుగా నెరిసిన జుట్టుకు చికిత్సగా వాడుతున్నారు. సహజసిద్ధంగా తల నెరవటం ఆపటానికి ఉల్లిపాయని తలకి రాయాలి అని మూళికల వైద్య నిపుణులు సలహాలిస్తున్నారు. 

 

ఉల్లిపాయ ముక్కలను మెత్తగా రుబ్బి, ఆ రసాన్ని తలకు, కేశాలకు పట్టించాలి. తర్వాత తలకు టవల్ చుట్టి 25-30నిముషాల అలాగే ఉంచాలి. దాంతో హెయిర్ ఫాలీ సెల్స్ కు బాగా ప్రసరిస్తుంది. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల తల మాసిన వాసన శుభ్రంగా తొలగిపోతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: