సాధారణంగా ఈ మద్య మనం తింటున్న ఆహారం వల్ల చిన్న వయసులోనే రక రకాల జబ్బులు వస్తున్నాయి. ముఖ్యంగా మన జుట్టు విషయంలో ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. బయల పొల్యూషన్ లో తిరగడం వల్ల జుట్టు బలాన్ని కోల్పోతుంది. మరికొంత మందికి జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతుంది....దాంతో మానసికంగా కృంగిపోతుంటారు. జుట్టుకు ఎప్పుడూ రంగు వేసుకోవాల్సి వస్తుంది. ఈ కాలంలో భూమి నుండి కొత్తగా పుట్టే అనేక మొక్కల్లో గుంటగలగర, తెల్లగలిజేరు మొక్కలు ప్రత్యేక శక్తిగలవిగా మహర్షులు గుర్తించారు. 

 

విధానం : ఈ మొక్కలను ముందుగా చూసిపెట్టుకొని చంద్రడు శుక్లమిలో వృద్దిచెందుతున్న కాలంలో పుష్యమి నక్షత్రం వచ్చినరోజున ఉదయం స్నానంచేసి ఆ మొక్కల వద్దకు వెళ్ళాలి. వాటికి ధూపదీపనైవేధ్యాలిచ్చి విడివిడిగా గుంటగలగర మొక్కలను తెల్లగలిజేరు మొక్కలను సమూలంగా తెచ్చుకోవాలి. వాటిని చిన్నచిన్న ముక్కలుగా చేసి నీళ్ళతో కడిగి నీడలో భాగా గాలితగిలే చోట ఆరబెట్టి ఎండిన తరువాత ధంచిజల్లించుకోవాలి.  అలా తయారు చేసిన గుంటగలగరపొడి 100 గ్రాములు తెల్లగలిగజేరు చూర్ణం 100 గ్రాములు తీసుకోవాలి. వాటితోపాటు బలంగా ఉన్న నల్లనువ్వులను దంచి ఎండబెట్టి మరలా దంచి జల్లించిన చూర్ణం ఎండబెట్టి ధంచి జల్లించిన చూర్ణం 100గ్రాములు ఛైత్రమాసంలో సేకరించిన ఉసిరికపండ్ల పైబెరడుపొడి 100 గ్రామలు పటికెబెల్లంపొడి లేదా పాతనల్లబెల్లం 100గ్రాములు కూడా తీసుకొని అన్ని చూర్ణాలను ఒకపాత్రలో వేసి బాగా కలబెట్టి పలుచని నూలుబట్టలో వస్త్ర ఘూళితంచేసి గాజుసీసాలో నిలువ చేసుకోవాలి. ఒకవేళ బెల్లం కలిపితే దంచి ముద్దగా చేసి నిలువచేసుకోవాలి.

 

వాడేవిధానం : ముందుగా అల్లంరసం 2 చెంచాలు ,తేనె 2 చెంచాలు, 4 చెంచాలు కలిపి చిన్న మంటపైన సాగించి దించి గోరువెచ్చగా అయిన తరువాత తెల్లవారుఝామున ఆ పధార్థాన్ని సేవించాలి. దీనివల్ల నాలుగైదుసార్లు సుఖవిరేచనమై ఉధరశుధ్ధి జరుగుతుంది. ఆ తరువాత ఒకటి రెండు రోజులాగి ఈ చూర్ణాన్ని ఉధయం పరగడపున, రాత్రి ఆహారానికి గంటముందు 10 గ్రాములు మోతాదుగా లోనికి సేవించాలి.

 

ప్రయోజనాలు : ఈ రసాన్ని సేవిస్తూ చింతపండు పులుపు పూర్తిగా నిషేధించి దానికి బదులుగా మామిడి ఒరుగుగాని, ఉసిరిఒరుగుగాని, ఆరబెట్టిన చింతాకుగాని వాడుకోవాలి. మామూలు ఉప్పుకు బదులు సైంధవలవణం, ఎండుమిరపకారంతో పాటు మిరియాలపొడి కూడా కలిపి కూరల్లో ఉపయోగించాలి. మాంసాహారం పూర్తిగా వర్జించి సేవిస్తుంటే పూర్తిగా ముగ్గుబట్టలాగా తెల్లగా అయిన జుట్టుమొత్తం క్రమంగా తిరిగి నల్లబడుతుంది. అంతేకాక మనోవికాసం, శారీరకదారుఢ్యం, సుధీర్ఘమైన ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: