చాలామంది యువతులు తమ కురుల(జుట్టు)ను మరింత అందంగా తీర్చిదిద్దుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఇందుకోసం పడరాని పాట్లు పడుతుంటారు. ముఖ్యంగా జుట్టు మరింత నిగారింపుగా ఉండేందుకు అనేక రకాలైన రంగులు వేస్తుంటారు. ఇదే అంశంపై బ్యూటీషియన్లను ఏమంటున్నారంటే...  కురులకు మరింత నిగారింపు రావాలంటే.. అరకప్పు తేనె తీసుకుని కుదుళ్ళ నుంచి తలంతా రాసుకుని క్యాప్‌ పెట్టుకుని అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు మంచి నిగారింపు సంతరించుకుంటుందని చెపుతున్నారు.  అలాగే, తలస్నానం చేసిన అరగంట తర్వాత కప్పు తేనెకు పావుకప్పు ఆలివ్‌ నూనె కలిపి తలకు మర్దన చేసి, పావుగంటయ్యాక శుభ్రం చేస్తే కురులు పట్టుకుచ్చులా మెరుస్తాయి. ఇలా పదిహేను రోజులకోసారి చేస్తే కురులు బాగా ఉంటాయని చెపుతున్నారు.  చెంచా తేనెలో చిటికెడు పంచదార కలిపి ముఖానికి మృదువుగా మర్దన చేస్తే చర్మం మీద మృత కణాలను తొలగించి, చర్మానికి తేమను అందిస్తుందట. కప్పు ఆలివ్‌ నూనెకు, అరకప్పు తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి తలకు మర్దన చేసి అర్థగంట తర్వాత షాంపూతో కడిగేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందని బ్యూటీషియన్లు చెపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: