Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Fri, Mar 23, 2018 | Last Updated 2:21 pm IST

Menu &Sections

Search

మొటిమలు లేని అందమైన ముఖారవిందం చిన్న చిట్కాలతో

మొటిమలు లేని అందమైన ముఖారవిందం చిన్న చిట్కాలతో
మొటిమలు లేని అందమైన ముఖారవిందం చిన్న చిట్కాలతో
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

beauty-tips-getting-rid-of-pimples-smaller-home-re


అందాలరాణి నగుమోము పైనున్న మొటిమల నివారణ ఎలా?  ఒక్క మొటిమ ఉంటే బాగానేఉంటుంది. మరి ఎక్కువ అయితే ముఖం అంద విహీనంగా తయారవుతుంది. మొటిమలు లేని అందమైన ముఖారవిందం మీ సొంతం చేసుకోవాలంటే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు.

beauty-tips-getting-rid-of-pimples-smaller-home-re

- నిమ్మరసం, రోజ్‌వాటర్ సమపాళ్లలో తీసుకోవాలి. దీనిని ముఖంపై మొటిమలు ఉన్న భాగంలో రాయాలి. అరగంట తరువాత కడిగేయాలి. తరచూ దీన్ని చేస్తే మూడు, నాలుగువారాల్లో మొటిమలు తగ్గిపోతాయి.

- పల్లీనూనె, నిమ్మరసం సమపాళ్లలో తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి మర్దనా చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు తగ్గిపోవడమే కాదు.. మొటిమలతో వచ్చే ఇతర సమస్యలూ మాయమవుతాయి.

- మొటిమల ముఖానికి తేనె కూడా మేలు చేస్తుంది. మూడు తేనెకు ఒక దాల్చిన చెక్క పొడిని కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, పూర్తిగా ఆరిపోయిన తరువాత కడిగేయాలి. రెండు వారాలు వరుసగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.


beauty-tips-getting-rid-of-pimples-smaller-home-re


- ఆపిల్ పేస్టుకు తేనెను కలిపి ముఖానికి ఫేషియల్ వేసుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తరువాత కడిగేస్తే మొటిమలు, మచ్చలు మాయమవుతాయి.

- మొటిమలు ఎక్కువగా బాధిస్తుంటే వెల్లుల్లిని తీసుకుని పేస్ట్ చేసి, ఆ పేస్ట్‌ను మొటిమలున్న చోటపెట్టాలి. దీనిని ఆహారంలోకూడా తీసుకుంటే సత్వర ఫలితాలుంటాయి.

- టమాట గుజ్జును తరచుగా ముఖానికి మర్దనా చేస్తే మొటిమలు పోవడమే కాదు... ముఖం కాంతివంతమవుతుంది.


- కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు, పసుపు కలిపి ముఖానికి రాసి అరగంట తరువాత చన్నీళ్లతో కడిగేస్తే మొటిమలు మాయం.

- పుదీనా ఆకులను మెత్తగా నూరి ప్రతిరోజూ రాత్రిపూట ముఖానికి రాసుకోవాలి. పొద్దునే గోరు వెచ్చని నీటితో కడిగి తుడిచేయాలి. ఇలా వారం రోజులపాటు చేస్తే మొటిమలు తగ్గుముఖం పడతాయి.

- ముఖంపై మొటిమలు మచ్చలు రాకుండా ఉండాలంటే ఉడికించిన  చిన్నపాటి ఆలుగడ్డ పేస్ట్‌లో కొన్నిచుక్కల నిమ్మరసం కలిపిన మిశ్రమాన్ని ముఖానికిరాస్తే మొటిమలు పోతాయి.beauty-tips-getting-rid-of-pimples-smaller-home-re

- ఉసిరి విత్తనాలు నాలుగైదు గంటలపాటు నీటిలో నానబెట్టి, ఆ తరువాత వాటిని పేస్ట్ చేసి ముఖానికి పట్టిస్తే కూడా మంచి ఫలితం ఉంటుంది.

- పాలలో టమాటారసం కలిపి రాస్తే మొటిమలు తగ్గుతాయి.

- చందనం పొడి, కర్పూరం పొడి నీటిలో కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి అరగంట తరువాత కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు నెమ్మదిగా మాయమవుతాయి.


beauty-tips-getting-rid-of-pimples-smaller-home-re

- కీరదోస లేదా దోస గుజ్జును ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగేయాలి.

- వీటితోపాటు... ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే, రాత్రి పడుకునే ముందు సల్ఫర్ ఉన్న సబ్బుతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

- జుట్టు ముఖం మీదకి వస్తే వెంట్రుకల్లో ఉండే ఆయిల్స్ ముఖంపై చేరి మొటిమలు రావడానికి కారణమవుతాయి. సో జుట్టు ముఖం మీదకి రాకుండా చూసుకోవాలి.

beauty-tips-getting-rid-of-pimples-smaller-home-re

- ఎక్కువగా మేకప్ వేసుకోవడం కూడా మొటిమలు, మచ్చలకు దారి తీస్తుంది. అందుకే వాటర్ బేస్‌డ్-మేకప్ కాస్మొటిక్స్ వాడటం మంచిది.

- ఒక్క మొటిమ అయినా అస్తమానం చేయి దానిమీదికే పోతుంది. దాన్ని పిండుతూ ఉంటారు. దీనివల్ల మొటిమలు ముఖమంతా వ్యాపించే అవకాశం ఉంటుంది.

పై చిట్కాలలో మీకు నచ్చిన ఎవైనా అనుసరిస్తే కొద్దిరోజుల్లో మీ ముఖసౌందర్యం కాంతులు వెదజల్లుతుంది.

beauty-tips-getting-rid-of-pimples-smaller-home-re

beauty-tips-getting-rid-of-pimples-smaller-home-re
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
నటుడు శివాజి "అపరేషణ్ గరుడ" బహు బీతావహం - టిడిపి కోసం ఇంత త్యా..గం చేయాలా?
చంద్రబాబూ! నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా! వ్యధ చెందకు బ్రదర్ ఇంకెన్ని చూడాలో?
"చంద్రబాబు రాజకీయనాయకుడు కాదు! రాజకీయ వ్యభిచారి" : పోసాని కృష్ణ మురళి
టిడిపి ప్రభుత్వ పూజారి పాత్ర లేకుంటే ఏపికి కేంద్ర నిధులు సరిగానె అందివుండేవా?
బ్యూటీ క్వీన్ శ్రీదేవి చుట్టూ వై-ఫై లా మాధురీ దీక్షిత్ & విద్యాబాలన్
తెదెపాకే అవిశ్వాసం నెగ్గాలని లేనట్లుంది - టైమ్స్ నౌ ఛానెల్   ప్రసారం చేసిన నిజం
జనసేన "మైండ్ గేం" టిడిపికి "లైఫ్ ట్రబుల్"
బాబు రాజెంద్రప్రసాద్ నోటి దూలకు టాలీవుడ్ పోసాని కృష్ణ మురళి నిర్ఘాంతపోయే ఝలక్
"బాబు"ల వాగుడుకి దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కౌంటర్ తో మరో ఝలక్
బిజెపి విశ్వాసం కోల్పోయిన టిడిపి - పార్లమెంటులో పిల్లిమొగ్గ లేస్తున్న అవిశ్వాసం
కేసిఆర్ మాత్రమే బాబుతో సహా ఎవరినైనా ఆడించగలరు - ఆయన్ని ఎవరూ  ఆడించలేరు
మమతా బెనర్జి తో బెడిసికొట్టిన కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ వ్యూహం
ఉరిమురిమి మంగలం మీదపడ్డట్టు ఈ టిడిపి ఎమెల్సీ టాలీవుడ్ మీద పడిపోయారెంటి?
కళ్యాణ దోషం - కాలసర్ప దోషం - నర దృష్టి దోషం - నివారణ ఏలా?
సినిమాలో శ్రీదెవికి స్థానాన్ని మాధురి దీక్షిత్ భర్తీ చేస్తుంది: శ్రీదెవి తనయ జహ్నవి
పవన్ కళ్యాణ్ ప్రశ్నలో అంత అంతరార్థం ఉందా..!
ఎడిటోరియల్: బాజపాను "ఢీ" కొట్టటానికి కలసిరాని కాలం! ఆ పాపం స్వయానా చంద్రబాబు దే!
ప్రత్యేక హోదాపెద్ద విషయం కాదు! పవన్ కళ్యాణ్ బిగ్ U - టర్న్
కొత్త రాజకీయ కూటములకు శ్రీకారం - కెసిఆర్ ఫెడరల్ ఫ్రెంట్ & అఖిలేష్ సెక్యులర్  ఫ్రెంట్
నాని నాగార్జున కాంబో సినిమా - ఫన్ ఫిల్ల్డ్ కామెడీ థ్రిల్లర్
చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరవైన - వైసిపి పెట్టిన పుట్టలో టిడిపి పాములు చేరాయా?
మన అందాల మాజీ పార్లమెంట్ సభ్యురాల్ని వెంటాడి వేదించిన అల్లాఉద్ధీన్ ఖిల్జీ
అమరావతి అంతా గ్రాఫిక్సే - అక్కడికి వెళ్ళి చూస్తే ఆ సీన్ ఏమీ ఉండదు: కేంద్ర మంత్రి పీయుష్
ఉగాది "యుగాది" ఎందుకైంది? ఉగాది పచ్చడి అసలెందుకు తినాలి?
About the author