1. కొత్తిమీర ఆకులు రసము నందు పసుపు కలిపి ముఖానికి ప్రతిరోజు రాత్రి రాసి ఉదయం కడిగేసిన మొటిమలు నివారించబడుతాయి.
ఇవి 20 -25 రోజులు చేయాలి. దీనివలన ముఖ వర్చస్సు కూడా పెరుగుతుంది ముఖం ఎండిపోయినట్లు ఉండడం తగ్గుతుంది.

2. బంతి ఆకులు మెత్తగానూరి,రాత్రి మొటిమలపైరాసిఉదయం ముఖము కడిగి వేసిన మొటిమలు తగ్గిపోతాయి.

3. చేమంతి ఆకులను మెత్తగా నూరి రాత్రి మొటిమలపై రాసి ఉదయం ముఖం కడుక్కోవాలి.

4. స్రీలకు , మలబద్దక సమస్య ఉన్న లేదా బహిష్టు నెల సరిగా రాక పోయినా ముఖం మీద మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ రెండు సమస్యలు ఏవైనా ఉంటే ముందు వాటికి చికిత్స చేసుకోండి. కొందరికి యుక్త  వయసులో(14-25) మొటిమలు రావడానికి కూడా సహజమే.

5.నిమ్మరసం, రోజ్‌వాటర్ సమపాళ్లలో తీసుకోవాలి. దీనిని ముఖంపై మొటిమలు ఉన్న భాగంలో రాయాలి. అరగంట తరువాత కడిగేయాలి. తరచూ దీన్ని చేస్తే మూడు, నాలుగువారాల్లో మొటిమలు తగ్గిపోతాయి.

6. మొటిమల ముఖానికి తేనె కూడా మేలు చేస్తుంది. మూడు తేనెకు ఒక దాల్చిన చెక్క పొడిని కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని, పూర్తిగా ఆరిపోయిన తరువాత కడిగేయాలి. రెండు వారాలు వరుసగా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

7. ఆపిల్ పేస్టుకు తేనెను కలిపి ముఖానికి ఫేషియల్ వేసుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తరువాత కడిగేస్తే మొటిమలు, మచ్చలు మాయమవుతాయి.

8. మొటిమలు ఎక్కువగా బాధిస్తుంటే వెల్లుల్లిని తీసుకుని పేస్ట్ చేసి, ఆ పేస్ట్‌ను మొటిమలున్న చోటపెట్టాలి. దీనిని ఆహారంలోకూడా తీసుకుంటే సత్వర ఫలితాలుంటాయి.

8. టమాట గుజ్జును తరచుగా ముఖానికి మర్దనా చేస్తే మొటిమలు పోవడమే కాదు... ముఖం కాంతివంతమవుతుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: