వయసులో ఉన్న వారిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ముఖంపై వచ్చే మొటిమలు ఒకటి. ఇవి కౌమార దశలోకి అడుగుపెట్టిన వయస్సు వారి నుండి పెద్దవారి వరకు వస్తుంటాయి. ముఖం ఎంత అందంగా ఉన్నా, మొటిమలు వచ్చాయంటే అసహ్యంగా కనిపిస్తారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, మొటిమలు తగ్గకపోగా మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి.


పైగా, అవి ఖర్చుతో కూడుకున్నవి. ఈ క్ర‌మంలో అలా ఏర్ప‌డే మొటిమ‌ల‌ను తొలగించుకోవ‌డం కోసం అనేక మంది ర‌క ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను ఆశ్ర‌యిస్తుంటారు. అయితే అలాంటి వారు కింద ఇచ్చిన ప‌లు సూచ‌న‌లు పాటిస్తే దాంతో మొటిమ‌ల‌ను ఎఫెక్టివ్‌గా తొలగించుకునేందుకు వీలుంటుంది. ఆ సూచ‌న‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం... 


ఒక పాత్రలో కొద్దిగా శెనగపిండి తీసుకుని, అందులో కాస్త పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పేస్ట్‌లా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకున్న తర్వాత దాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాలపాటు అలాగే ఉంచి తర్వాత, గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా తరుచుగా చేస్తే.. మొటిమలు తగ్గుతాయి.


ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక సౌంద‌ర్య సాధ‌న ఉత్ప‌త్తుల్లో వాడుతున్నారు. ఇందులో యాంటీ సెప్టిక్ గుణాలు ఉండ‌డం వ‌ల్ల చ‌ర్మానికి మేలు చేస్తుంది. ఇందులోని పెరాక్సైడ్ బాక్టీరియా క్రిముల‌ను చంప‌డ‌మే కాదు, చ‌ర్మం సురక్షితంగా ఉండేలా చేస్తుంది. బెంజోయిక్ యాసిడ్ క్రిముల‌కు, ఇన్‌ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తుంది. అందువ‌ల్ల చ‌ర్మంపై ఉన్న మొటిమ‌లు ఇట్టే తొల‌గిపోతాయి.


అర‌టి పండు తొక్క‌ను తీసుకున దాని లోప‌లి భాగాన్ని ముఖంపై మ‌సాజ్ చేసిన‌ట్టు అప్లై చేయాలి. అనంత‌రం 30 నిమిషాల పాటు వేచి ఉన్నాక ముఖాన్ని క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు పోయి, ముఖం కాంతివంతంగా మారుతుంది.


గులాబీ రేకులు, బచ్చలి ఆకులు నూరి ముఖానికి రాసుకుని అర్థ గంట తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమల నుంచి ఉపశమనం పొందవచ్చు.


ఒక భాగం యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్‌కు 3 భాగాల నీరు క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. దీన్ని రాత్రి పూట ప‌డుకునే ముందు మొటిమ‌ల‌పై అప్లై చేయాలి. ఉద‌యాన్నే క‌డిగాక, ముఖానికి మాయిశ్చ‌రైజ‌ర్ రాసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే మొటిమ‌లు పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.


ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా ఉల్లిరసం వేసి.. అనంతరం దాంట్లో కొంచెం తేనే కలుపుకుని ఈ మిశ్రమాన్ని మొటిమలు, వాటి మచ్చలపై రాసి.. కొద్దిసేపు మర్దన చేసుకోవాలి. గంటసేపు అలాగే వుంచుకోవాలి. ఆ తర్వాత సున్నిపిండితో కడిగితే మంచి ఫలితం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: