ఇంట్లోనే సౌందర్య సాధనాలు ఈ కింది విధంగా తయారు చేసుకోవచ్చు. క్లెన్సర్ ఇలా తయారు చేయండి. నాలుగు చెంచాల పెరుగు, రెండు చెంచాల నిమ్మరసం తీసుకుని బాగా కలపాలి. దీన్ని దూదితో ముఖం, మెడ, చేతులకు రాసుకుని, ఆరిపోయాక దూదితోనే శుభ్రం చేయాలి. జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. అస్ట్రిజెంట్ ఇలా చేయవచ్చు నాలుగు చెంచాల కీరా రసం, రెండు చెంచాల క్యారెట్ తీసుకుని భాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. కీరాల చక్రాలను ముఖం మీద గుండ్రంగా పెట్టుకోండి. ఇది సహజమైన అస్ట్రిజెంట్ గా పనిచేస్తుంది. బాడీ లోషన్ ఇలా చేయండి రెండు చెంచాల గ్లిసరిన్, అరచెంచా వెనిగర్, అరచెంచా తేనె తీసుకుని భాగా కలపాలి. స్నానం చేసేముందు ఈ మిశ్రమాన్ని శరీరమంతా రాసుకుని ఆరిపోయాక స్నానం చేస్తే చర్మం శుభ్రపడుతుంది. తయారీ 250 గ్రాముల చక్కెరలో ఆరు నిమ్మకాయల రసం చేర్చి సన్నని మంటమీద ఉడికించాలి. ముద్దయ్యాక దించాలి. ఇందులో ఒక పెద్ద చెంచా గ్లిసరిన్ చేర్చి గాజుపాత్రలో భద్రపడచండి, ఆవాంఛిత రోమాలను ఈ కోల్డ్ వ్యాక్స్ సాయంతో తొలగించవచ్చు. ఒక చెంచా పాలు, రెండు చెంచాల రసం, అర చెంచా నిమ్మరసం కలిపి శరీరానికి రాసుకోవాలి. ఇది చర్మరంధ్రాలు శుభ్రపరిచి చర్మానికి కాంతినిస్తుంది. ఆకులు వేసి, బాగా మరిగించండి. తరువాత రసాన్ని పట్టించుకోవాలి. ఇలా చయడం వల్ల చర్మం తాజాగా ఉంటుంది. ఒక చెంచా బాదాముల తైలం, ఒక చెంచా పెట్రోలియం జెల్లీ, ఒక చెంచా నిమ్మరసం, 2 చెంచాలు గ్లిసరిన్ వీటన్నిటినీ బాగా కలిపి సీసాలో పోసి పెట్టుకోవాలి. చేతులకు ఈ లోషన్ రాసుకుంటే చేతులు మృదువుగాను, అందంగాను ఉంటాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: