ఇప్పుడు మనిషిని చూసి మనిషి భయపడే పరిస్థితి నెలకొంది. మొన్నటి వరకు గుంపులు గుంపులుగా కలిసి మెలిసి తిరిగిన వారు ఇప్పుడు సామాజిక దూరం మెయింటేన్ చేస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఎవరికి కరోనా ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా  గాజువాక ప్రాంతం ఓ చికెన్ వ్యాపారస్తుడికి కరోనా పాజిటీవ్ సోకినట్లు వార్తు వచ్చాయి. దాంతో గాజువాక ప్రాంతం కుంచమాంబలో ప్రజలు ఆందోళన గురవుతున్నారు.  అయితే ఆదివారం ఉదయం నుంచి సాయంత్ర వరకు సదరు వ్యాపారి షాపులో కూర్చొని చాలా మందికి చికెన్ అమ్మాడు.

 

ఆదివారం అతడి చికెన్ షాపు జనంతో నిండిపోయింది.  కాగా, అతనికి ఉన్నట్టుండి ఒక్కసారే జలుబు, దగ్గు, జ్వరం తీవ్రం కావడంతో స్థానిక ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. అతడి పరీక్షలు చేయగా కరోనా పాజిటీవ్ వచ్చింది. సదరు వ్యక్తి మార్చి 22న విదేశాల నుంచి వచ్చినట్టు పోలీసులు తెలిపారు.  గత కొన్ని రోజులుగా విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే.

 

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ కరోనా మహమ్మారి ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారికే సోకిన విషయం తెలిసిందే. తాజాగా కుంచమాంబ కాలనీని పోలీసులు రెడ్ జోన్‌గా ప్రకటించారు. వైజాగ్‌లో ఇప్పటి వరకు 18మందికి కరోనా వైరస్ సోకింది. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోగుల సంఖ్య 304కు చేరుకోగా ముగ్గురు మృత్యువాతపడ్డారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: