తెలంగాణ‌లో ఏప్రిల్ 30 వ‌ర‌కు లాక్‌డౌన్ కొన‌సాగుతుంద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.  ద‌య‌చేసి ప్ర‌జ‌లంతా  లాక్‌డౌన్‌కు స‌హ‌క‌రించాల‌ని  విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌తి ఒక్క‌రూ సామాజిక దూరం పాటించి, క‌రోనాను త‌రిమికొట్టాల‌ని పిలుపునిచ్చారు. నాలుగు రోజులు ఓపిక ప‌డితే , ద‌శ‌ల‌వారిగా లాక్‌డౌన్ ఎత్తివేస్తామ‌ని ఆయ‌న తెలిపారు.  ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌పై కూడా త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సీఎం  తెలిపారు. క‌నీసం రెండు వారాలు లాక్‌డౌన్‌ను పొడిగించాల‌ని ఇప్ప‌టికే ప్ర‌ధానిని కోరామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

 

సుదీర్ఘంగా కొనసాగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ముగిసింది.  ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ అధ్య‌క్ష‌త‌న నిర్వహించిన ఈ స‌మావేశం ఐదు గంట‌ల‌కుపైగా క‌న‌సాగింది.  లాక్‌డౌన్ పొడిగింపు అంశంతోపాటు ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర ఆర్థిక స్థితిగ‌తుల‌పై ప్ర‌ధానంగా  చర్చించారు.  

 

క‌రోనా వైర‌స్ ని యంత్ర‌ణ‌కు లాక్ డౌన్ పొడిగించ‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని కేబినెట్ నిర్ణ‌యించింది.  కాబినెట్ స‌మావేశం అనంత‌రం సీఎం కేసీఆర్ విలేక‌రులతో మాట్లాడారు. మంత్రివ‌ర్గ స‌మావేశంలో చ‌ర్చించిన అంశాల‌ను వెల్ల‌డించారు.  క‌రోనాతో ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో 14 మంది చ‌నిపోయార‌ని ఆయ‌న తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: