క‌రోనా వైర‌స్‌తో అగ్ర‌రాజ్యం అమెరికా అత‌లాకుతలం అవుతోంది. ఇక ఆదే ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ నగరంలో క‌రోనా బీభ‌త్సం సృష్టిస్తోంది. ఒక్క నగరంలోనే క‌రోనా వైర‌స్‌ బాధితుల సంఖ్య లక్ష దాటడం గ‌మ‌నార్హం. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమిటంటే.. బ్రిట‌న్‌, చైనాల‌ కన్నా ఈ సంఖ్య చాలా ఎక్కువ. అంటే క‌రోనా కేసుల్లో ఈ రెండు దేశాల‌ను క‌న్నా ఒక్క న్యూయార్క్ న‌గ‌రంలోనే అధికం కావ‌డం గ‌మ‌నార్హం. నగరంలో ఆదివారం ఒక్కరోజే 5,695 కేసులు నమోదయ్యాయి. దీంతో బాధితుల సంఖ్య 1,04,410కు పెరిగింది. మృతుల సంఖ్య 6,898కు చేరుకుంది.

 

అమెరికా మొత్తం కేసుల్లో 20శాతం కేసులు న్యూయార్క్‌లోనే ఉన్నాయి. కరోనా ఒక్కరోజులోనే 758 మందిని బ‌లితీసుకుంద‌ని న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్యూ క్యూమో పేర్కొన్నారు. ఇక అమెరికాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య ఐదున్నర లక్షలు దాటింది. ఇప్పటివరకు 22 వేల మందికిపైగా క‌రోనా వైర‌స్‌తో మృత్యువాత పడ్డారు. అలాగే.. ఇప్ప‌టివ‌ర‌కు ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల పాజిటివ్‌ కేసులు నమోదుకాగా, ఇందులో 30 శాతం ఒక్క అమెరికాలోనే ఉండ‌డం గ‌మ‌నార్హం.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: