క‌రోనాతో అత‌లాకుత‌లం అవుతున్న యూర‌ప్ దేశం ఫ్రాన్స్ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్రాణాంతక కొవిడ్‌-19ను కట్టడి చేసేందుకు మే 11 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఆ తర్వాత దశల వారీగా విద్యా, వ్యాపార సంస్థలు తిరిగి ప్రారంభించేలా చర్యలు చేపడతామని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మాక్రాన్‌  వెల్లడించారు. అదే విధంగా జూలై వ‌ర‌కూ బహిరంగ కార్యక్రమాలకు అనుమతినివ్వబోమని ఆయ‌న‌ స్పష్టం చేశారు. ఈసంద‌ర్భంగా దేశ‌ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు.

 

దేశంలో కరోనా నెమ్మదిస్తుందని భావిస్తున్నామ‌ని అన్నారు. త‌ర్వ‌లోనే ఆశలు చిగురిస్తాయని.. మే 11 తర్వాత కొత్త దశ ప్రారంభమవుతుందని అన్నారు. రోజువారీగా ఫలితాలను అంచనా వేస్తూ క్రమక్రమంగా లాక్‌డౌన్‌ ఎత్తివేయాలనుకుంటున్నామ‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. అయితే.. కొద్దిరోజులుగా ఫ్రాన్స్‌లో క‌రోనా నెమ్మ‌దించిన‌ట్టే అనిపించింది. అయితే.. అనూహ్యంగా సోమవారం ఒకేరోజు ఫ్రాన్స్‌లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరగింది. దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం మార్చి 17న విధించిన లాక్‌డౌన్ మే 11వ‌ర‌కు పొడిగిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: