ఇది నిజంగా శుభ‌వార్తే.. క‌రోనా భ‌యం పోగొట్టి మ‌న‌లో ఆత్మ‌స్థైర్యాన్ని నింపే ముచ్చ‌టే ఇది. క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు మ‌న‌లో మ‌రింత సంక‌ల్ప‌బ‌లాన్ని క‌లిగించే అంశ‌మే ఇది. ఎంత‌సేసూ పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాల సంఖ్య‌నే చూడ‌గాకుండా.. ఒక్క‌సారి క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్యను చూస్తే మ‌న‌కు ఎంతో ధైర్యం వ‌స్తుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా బారి నుంచి కోలుకునే వారి సంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతూనే ఉంది. ప్రాణాల‌కు తెగించి వైద్య‌సేవ‌లు అందిస్తున్న వైద్య‌సిబ్బంది రాత్రింబ‌వ‌ళ్ల క‌ష్టం వ‌ల్ల లక్ష‌లాదిమంది కోలుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 5ల‌క్ష‌ల మందికిపైగా క‌రోనా వైర‌స్‌ను జ‌యించారు. ఇది ఎంతో మాన‌వాళిలో ఎంతో ఆత్మ‌స్థైర్యాన్ని నింపుతోంది. ఎంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌నైనా మ‌నం జ‌యించి తీరుతామ‌న్న న‌మ్మ‌కాన్ని మ‌న‌లో పెంచుతోంది.

 

ఇక ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20ల‌క్ష‌ల‌కుపైగా చేరుకుంది. చైనాలోని వుహాన్ న‌గ‌రంలో కేంద్రంగా పుట్టిన క‌రోనా వైర‌స్ చూస్తుండగానే అన్నిదేశాల‌కు వ్యాపించింది. మొద‌టి 10ల‌క్ష‌ల కేసులు 93రోజుల్లో న‌మోదు కాగా.. కేవ‌లం 13రోజుల్లోనే మిగ‌తా 10ల‌క్ష‌ల కేసులు న‌మోదు అయ్యాయి. ఇందులో ప్ర‌ధానంగా యూర‌ప్ దేశాలు, అమెరికాలోనే అత్య‌ధిక కేసులు న‌మోదు అయ్యాయి. యునైటెడ్ స్టేట్స్, ఐరోపాలోని దేశాల్లో మొత్తం 78శాతం పాజిటివ్ కేసులు న‌మోదుకాగా.. 86శాతం మరణాలు సంభ‌వించాయి. నిజానికి.. చైనాలో ఈ వైర‌స్ పుట్టినా అమెరికా ఇప్పుడు ఇప్పుడు అతిపెద్ద హాట్ స్పాట్‌గా మారింది. కేవ‌లం 24 గంటల్లో 2,228 మరణాలను సంభ‌వించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య 26,000 కు చేరుకుంది. ఇక ఇందులో సుమారు 10,000 మంది న్యూయార్క్‌లోనే మృతి చెందారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: