భార‌త్‌లో క‌రోనా వైర‌స్ రోజురోజుకూ కొత్త ప్రాంతాల‌కు వ్యాపిస్తోంది. తాజాగా..ద‌క్షిణ ఢిల్లీలో  పిజ్జా డెలివరీ బాయ్ క‌రోనా బారిన ప‌డ‌డంతో క‌ల‌క‌లం రేగుతోంది. అధికారులు వెంట‌నే అప్ర‌మ‌త్తం అయ్యారు. అత‌డు పిజ్జాల‌ను డెలివ‌రీ చేసిన ప్రాంతాల‌ను గుర్తించే ప‌నిలోప‌డ్డారు. ఈ మేర‌కు దాదాపు 70 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. ద‌క్షిణ ఢిల్లీలోని హౌజ్ ఖాస్, మాల్వియా నగర్ ప్రాంతాల ప్రజలు క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ పిజ్జాబాయ్ ఈ ప్రాంతాల్లోనే పిజ్జాల‌ను డెలివ‌రీ చేశాడు. క్వారంటైన్‌లో ఉన్న వీరంద‌రికీ క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసేందుకు అధికారులు సిద్ద‌మ‌వుతున్నారు.

 

ఇదిలా ఉండ‌గా.. భార‌త్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 12, 380కిపైగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. మొత్తం 414 మంది మ‌ర‌ణించారు. ఇక‌ 10,477 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,488 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉండ‌గా.. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం దేశంలోని 207 జిల్లాలను హాట్‌స్పాట్‌లుగా ప్రకటించింది. కాగా, ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 20ల‌క్ష‌ల మందికిపైగా క‌రోనా బారిన ప‌డ్డారు. మొత్తం 28వేల మందికిపైగా మ‌ర‌ణించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: