ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత రేషన్‌ సరకుల పంపిణీ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఇప్ప‌టికే తొలి విడ‌త రేష‌న్ కంప్లీట్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ప్ర‌భుత్వం రెండో విడ‌త రేష‌న్ పంపీణీకి శ్రీకారం చుట్టింది. ఇప్ప‌టికే వ‌లంటీర్లు ఒకేసారి ప్ర‌జ‌లు గుమికూడ‌కుండా కూప‌న్లు పంపిణీ చేశారు. కూప‌న్ల వారీగానే రేష‌న్ పంపిణీ జ‌ర‌గ‌నుంది. ఉదయం నుంచే కూపన్లు తీసుకున్న వారికి ఒక్కో కుటుంబానికి కేజీ శనగలు, ఒక్కో సభ్యుడికి 5 కేజీల చొప్పున బియ్యం ఉచితంగా అందజేస్తున్నారు. రెడ్ జోన్ల‌లో ఉన్న కార్డుదారుల‌కు నేరుగానే ఇంటికి తీసుకువెళ్లి పంపిణీ చేస్తారు.

 

తొలి విడతగా మార్చి 29వ తేదీ నుంచి కార్డులో పేరు ఉన్న ఒక్కో సభ్యుడికి 5 కిలోల బియ్యం, కుటుంబానికి కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేశారు. ఇక ఇప్పుడు రెండో విడ‌త‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న‌ 1,47,24,017 కుటుంబాలకు బియ్యంతో పాటు కిలో శనగలు ఉచితంగా అందిస్తున్నారు. ఇక ల‌బ్దిదారులు భౌతిక దూరం పాటించేందుకే ముందుగా వ‌లంటీర్లు కూప‌న్లు పంపిణీ చేశారు. బయోమెట్రిక్‌ లేకుండానే సరుకులను అందజేస్తు​న్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: