ఏపీలో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు వేగంగా చేప‌ట్టేందుకు క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈరోజు ద‌క్షిణ కొరియా నుంచి ల‌క్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్ల‌ను తెప్పించింది. సియోల్ నుంచి ప్ర‌త్యేక విమానంలో ఈ కిట్ల‌ను తెప్పించింది. వీటిని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌రిశీలించి, ప్రారంభించారు. కాగా.  ఏపీలో కొత్తగా మరో 38కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం  కరోనా కేసుల సంఖ్య 572కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు.

 

గడచిన 24 గంటల్లో జరిగిన కరోనా నిర్దారణ పరీక్షల్లో.. కర్నూలు జిల్లాలో 13, నెల్లూరు 6. అనంతపురం 5, చిత్తూరు 5,  కృష్ణా 4 , గుంటూరు 4, కడప 1 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 35 మంది ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్‌ కాగా, 14 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 523 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అత్యధికంగా గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 126 కరోనా పాటిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఒక్క కరోనా కేసు కూడా నమోదుకాలేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: