టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు దిమ్మ‌దిరిగే లెక్క‌ల‌ను వైసీపీ వెల్ల‌డించింది. ఏపీలో క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటున్న చ‌ర్య‌లు ఎంత స‌త్ఫ‌లితాన్ని ఇస్తున్నాయో తెలిపే గ‌ణాంకాలను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. నిజానికి చంద్ర‌బాబు కొద్దిరోజులుగా వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఏపీలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చాలా నెమ్మ‌దిగా జ‌రుగుతున్నాయ‌ని, ఇలా అయితే.. క‌రోనాను ఎలా క‌ట్ట‌డి చేస్తారంటూ ప‌దేప‌దే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. వీటికి కౌంట‌ర్‌గా వైసీపీ లెక్క‌ల‌ను బ‌య‌ట‌పెట్టింది. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి అత్యుత్త‌మ చ‌ర్య‌లు తీసుకుంటున్న రాష్ట్రాల్లో దేశంలోనే ఏపీ ముందువ‌రుస‌లోనే ఉంద‌ని పేర్కొంటూ అందులో వివ‌రించారు.

 

ఎక్కువ క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసిన రాష్ట్రాల్లో రాజ‌స్తాన్‌, మ‌హారాష్ట్ర‌, కేర‌ళ త‌ర్వాత ఏపీ నాలుగో స్థానంలో ఉంద‌ని అందులో పేర్కొన్నారు. ఇక స‌గ‌టున‌ ప‌దిల‌క్ష‌ల మందికి ఏపీలో 331 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రిగాయ‌ని వివ‌రించారు. అంతేగాకుండా.. దేశం మొత్తంమీద తీసుకుంటే స‌గ‌టున ప‌దిల‌క్ష‌ల మందికి 198మందికి మాత్ర‌మే క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రిగాయ‌ని వైసీపీ ట్విట్ట‌ర్‌లో పేర్కొంది. ఇక దీనిపై బాబుగారు ఏమంటారో చూడాలి మ‌రి. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: