అమెరికాలో కోవిడ్‌ సృష్టిస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. 24 గంట‌ల వ్య‌వ‌ధిలోనే 4,591 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 37 వేలకు పైగా చేరుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌ధానంగా న్యూయార్క్, న్యూజెర్సీలో అత్య‌ధిక పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు న‌మోదు అవుతున్నాయి.  అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య‌ 709201కు చేరుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు 59997 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌ధానంగా న్యూయార్క్ న‌గ‌రంలో కొవిడ్‌-19కు హాట్‌స్పాట్‌గా మారింది.

 

సగానికి కంటే ఎక్కువ పాజిటివ్‌ కేసులు ఇక్క‌డే న‌మోదు అవుతున్నాయి.. స‌గానిక‌న్నా ఎక్కువ‌ మ‌ర‌ణాలు ఇక్క‌డే సంభ‌విస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 233951 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా... 17131 మంది మ‌ర‌ణించారు. సుమారు 192933 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆ త‌ర్వాత న్యూజెర్సీలో 78467 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఇక్క‌డ 3,840 మంది మ‌ర‌ణించారు. ఇంకా 73356యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా.. ఉన్నవేల సంఖ్య‌లో ఉన్న యాక్టివ్ కేసుల‌తో ముందుముందు మ‌ర‌ణాల సంఖ్య భారీగా పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు భావిస్తున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: