తెలంగాణ లో నానాటికి పెరుగుతున్న కేసుల దృష్ట్యా తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. 19 వ తారీఖు న తెలంగాణ కాబినెట్ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఈ అత్యవసర సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న ఏరియా లలో ఎటువంటి చర్యలు అమలు చేయాలో ముఖ్యమంత్రి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం వుంది. ఈ అత్యవసర సమావేశం దాదాపు మధ్యాహ్నం 2 గం.లకు జరుగనుంది .

 

అదేవిధంగా రేపు జరగ నున్నతెలంగాణ  క్యాసెట్ మీటింగ్ లో లాక్ డౌన్ పొడిగింపుకు సంభందించి కీలక నిర్ణయాలు చర్చకు రానున్నాయి.ఇప్పటివరకు తెలంగాణా మొత్తం కేసుల సంఖ్య 750 కి చేరుకుంది. ఇప్పటివరకు 18 మంది చనిపోయారు అయితే ఇప్పటివరకు 561 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయి. గాంధీ హాస్పిటల్లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా తెలంగాణ వైద్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర గాంధీ హాస్పిటల్ ని సందర్శించారు . వైద్యులపై జరుగుతున్న దాడుల దృష్ట్యా వారికీ అండగా నిలిచారు. ఆసుపత్రి సిబ్బంది పై దాడులు జరిపితే కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. కుటుంబ సభ్యులను  వదిలి పేషేంట్ల కొరకు కష్టపడే వారిపై దాడులు మంచిది కాదు అని హితవు పలికారు  

మరింత సమాచారం తెలుసుకోండి: