ఏపీ ప్ర‌భుత్వాన్ని ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు మెచ్చుకున్నారు. ఏపీలో క‌రోనా క‌ట్ట‌డికి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీసుకుంటున్న చ‌ర్య‌లను ఆయ‌న ప‌రోక్షంగా అభినందించారు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. నిన్న ద‌క్షిణ కొరియా నుంచి ప్ర‌త్యేక విమానంలో ఏకంగా ల‌క్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్ల‌ను ఏపీ ప్ర‌భుత్వం తెప్పించుకుంది. ఈ కిట్ల‌ను స్వ‌యంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప‌రిశీలించి ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకున్నారు. కేవ‌లం ప‌దినిమిషాల్లోనే ఫ‌లితం వ‌చ్చింది. ఆయ‌న‌కు నెగెటివ్ అని తేలింది.

 

అయితే ద‌క్షిణ కొరియా నుంచి కిట్లు తెప్పించుకున్న విష‌యంపై ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌నాయుడు ట్విట్ట‌ర్‌లో స్పందించారు. ద‌క్షిణ కొరియా నుంచి ల‌క్ష ర్యాపిడ్ టెస్ట్ కిట్ల‌ను తెప్పించుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని పేర్కొన్నారు. *ఈ కిట్లు కేవలం 10 నిమిషాల్లో ఫలితాలను అందించగలవని నాకు సమాచారం అందింది. ఈ కిట్లు కరోనా నిర్ధార‌ణ‌ పరీక్షను వేగవంతం చేయడంలో సాయ‌ప‌డుతాయి. అలాగే.. వైరస్ వ్యాప్తిని నివారించే ప్రయత్నాలను బలోపేతం చేస్తాయి* అని ట్వీట్ చేశారు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: