కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల రిపోర్టులు తారుమారయ్యాయి. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం నుల‌క‌పేట‌లో చోటుచేసుకుంది వివరాలు. ఇలా ఉన్నాయి. నుల‌క‌పేట‌కు చెందిన కొంద‌రు వ్య‌క్తులు గత మార్చిలో ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనల వెళ్లి వచ్చారు. వారంద‌రినీ అధికారులు వెంటనే గుంటూరులో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు త‌ర‌లించారు. అయితే.. వీరిలో ఇద్ద‌రు వ్య‌క్తులు ఒకే పేరుతో ఉన్నారు. నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో రెండుసార్లు నెగెటివ్ వ‌చ్చి క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారంద‌రినీ నిన్న సాయంత్రం ఇంటికి పంపించారు.

 

అయితే.. వారంద‌రినీ ఇంటికి పంపించే ముందు నెగెటివ్ వ‌చ్చిన వ్య‌క్తికి పాజిటివ్ రిపోర్టు, పాజిటివ్ వ‌చ్చిన వ్య‌క్తికి నెగెటివ్ రిపోర్టు ఇచ్చారు. దీంతో ఇంటికి వెళ్లిన వ్య‌క్తికే పాజిటివ్ అని తెలియ‌డంతో అధికారులు వెంట‌నే అల‌ర్ట్ అయ్యారు. నుల‌క‌పేట‌కు వెళ్లి వెంట‌నే అత‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ముగ్గురు కుటుంబ స‌భ్యుల‌ను క్వారంటైన్‌కు త‌ర‌లించారు. గ్రామ‌స్తుల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం అవుతోంది. ఒకే పేరుతో ఇద్ద‌రు వ్య‌క్తులు ఉండ‌డం వ‌ల్లే డాక్ట‌ర్లు గుర్తించ‌డంలో పొర‌పాటు జ‌రిగి ఉంటుంద‌ని అధికారులు భావిస్తున్నారు. దీనిపై పూర్తి చేసి, బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: