క‌రోనా వైర‌స్ సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అనేక దేశాల‌న భార‌త్ ఆదుకుంటోంది. ప్ర‌ధానంగా కొవిడ్‌-19 చికిత్స‌లో వాడుతున్న హైడ్రాక్సీక్లోరోక్విన్, పారాసెట‌మాల్ మాత్ర‌ల‌ను అనేక దేశాల‌కు అందిస్తూ.. ప్రాణ‌స్నేహితుడికి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. సుమారు ఇప్ప‌టివ‌ర‌కు అగ్ర‌రాజ్యం అమెరికాతోపాటు 55 దేశాల‌కు ఈ సాయం అందించింది భార‌త్‌. ఈక్ర‌మంలోనే ఆఫ్ఘ‌నిస్తాన్‌న‌కు కూడా ఈ మాత్ర‌ల‌ను పెద్ద‌మొత్తంలో అందించింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోడీ ఆఫ్ఘ‌నిస్తాన్‌-భార‌త్ మ‌ధ్య ఉన్న సంబంధం గురించి ట్వీట్ చేశారు. చారిత్ర‌కంగా, భౌగోళికంగా, సంస్కృతిప‌రంగా భార‌త్‌-ఆఫ్ఘ‌నిస్తాన్ మ‌ధ్య మంచి స్నేహపూరిత అనుబంధం ఉంద‌ని ట్వీట్ చేశారు. ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా పోరాడుతున్నామ‌ని, ఇప్పుడు కొవిడ్‌-19 కూడా వ్య‌తిరేకంగా పోరాడుతున్నామ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

 

దీనికి ఆఫ్ఘ‌నిస్తాన్ అధ్య‌క్షుడు ఆష్ర‌ఫ్ ఘ‌ని స్పందించారు. * నా హ్నేహితుడు న‌రేంద్ర‌మోడీకి ధ‌న్య‌వాదాలు. హైడ్రాక్సీక్లోరోక్విన్,  పారాసెటమాల్ మాత్ర‌లు, 75,000 మెట్రిక్ టన్నుల గోధుమలను అందించినందుకు భారతదేశానికి ధన్యవాదాలు* అంటూ ట్వీట్ చేశారు. ఇందులో 5,000 మెట్రిక్ ట‌న్నుల గోధుమ‌లు ఒక రోజులోఆఫ్ఘ‌న్ ప్ర‌జ‌ల‌కు చేరుకుంటాయ‌ని పేర్కొన్నారు. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: