లాక్‌డౌన్ కార‌ణంగా ప్రజ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు ఏర్ప‌డకుండా తెలంగాణ ప్ర‌భుత్వం అనేక వినూత్న కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. క‌రోనా వైర‌స్ నుంచి కాపాడుకోవ‌డానికి తాజా పండ్లు తినాల‌ని ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌దేప‌దే చెబుతున్నారు. అందులోనూ బ‌త్తాయితోపాటు ప‌లు రకాల పండ్లు తిన‌డం వ‌ల్ల మ‌న‌లో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంద‌ని, అప్పుడు క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి త‌ప్పించుకునే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు అంటున్నాయి. ఈ క్ర‌మంలో లాక్‌డౌన్ కాలంలో ప్ర‌జ‌ల‌కు తాజా పండ్ల‌ను అందించేందుకు ఓ కార్య‌క్ర‌మం చేప‌ట్టింది.

 

ఇందుకోసం ఓ సెల్‌నంబ‌ర్‌ను ఏర్పాటు చేసింది. ఈ నంబ‌ర్‌కు ఒక్క మిస్డ్‌కాల్ ఇస్తేచాలు.. ఇంటివ‌ద్ద‌కే తాజా పండ్ల‌ను పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. 88753 51555 నంబర్‌కి ఒక్క మిస్‌డ్‌ కాల్ ఇస్తే ఇంటివద్దకే  కేవ‌లం రూ.300కు మామిడి(1.5 కేజీ), బొప్పాయి (3 కేజీలు), నిమ్మ(12కాయలు), పుచ్చ(3 కేజీలు), బత్తాయి(2 కేజీలు), సపోట(1 కేజీ) పండ్ల డెలివరీ చేస్తామ‌ని పేర్కొంది. 78 గంటల్లోగా ఇంటి వద్దకే పంపిణీ చేస్తామ‌ని చెప్పింది. ఈ సేవ‌ల‌ను వ్య‌వ‌సాయ‌శాఖ ఆధ్వ‌ర్యంలో చేప‌డుతోంది ప్ర‌భుత్వం. 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: