ఏపిలో కరోనా కట్టడి చేయడానికి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు, మంత్రి వర్గంలో సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నారు.  ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తాజాగా క‌ర్నూలు జిల్లాలో క‌రోనా కేసులు ఎక్కువ‌గా న‌మోద‌వుతున్న నేప‌ధ్యంలో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. గత కొన్ని రోజులుగా కర్నూల్, గుంటూరు లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.

 

కాగా,  క‌ర్నూలు జిల్లాల్లో ఇప్ప‌టికే 186 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ క్ర‌మంలో క‌ర్నూలు ప్ర‌భుత్వం ఆస్ప‌త్రిని కోవిడ్ ఆస్ప‌త్రిగా మార్చాల‌ని నిర్ణ‌యిస్తూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది.  ప్రస్తుతం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో 600 మంది చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. వారిని ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించి వైద్యం అందించాల‌ని నిర్ణ‌యించారు. ప్రయివేటు ఆసుపత్రులకు ఆరోగ్య శ్రీ పథకం కింద రోగులకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంద‌ని.. ఆరోగ్యశ్రీ వర్తించని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇస్తామని ప్ర‌భుత్వం తెలిపింది.  

 

ముఖ్యమంత్రి సూచనలు ప్రైవేటు ఆసుపత్రులు కూడా అంగీకరించినట్లు సమాచారం.  ఇదిలా ఉండగా... రాష్ట్రంలో కొత్తగా 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన వాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 757కు చేరింది. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: