క‌రోనా వైర‌స్‌పై వైద్యులు, వైద్య విద్యార్థులు, న‌ర్సులతోపాటు అనే విభాగాల వారు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. వీరింద‌రినీ కేంద్రం కొవిడ్ వారియ‌ర్స్‌గా పిలుస్తోంది. దేశ వ్యాప్తంగా కొవిడ్ వారియ‌ర్స్ 1,24,85,659మంది ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. తెలంగాణ‌లో క‌న్నా.. ఏపీలోనే రెట్టింపు సంఖ్య‌లో కొవిడ్ వారియర్స్ ఉన్నారు. ఈ విష‌యం కేంద్రం రూపొందించిన వెబ్‌సైట్‌లో ఉంది. ఏపీలో కరోనా మహమ్మారిపై పోరాడుతున్న 6,23,202 మంది యోధులు అందుబాటులో ఉన్నట్లు కేంద్రం తాజాగా రూపొందించిన కోవిడ్‌ వారియర్స్‌ వెబ్‌సైట్‌లో పేర్కొంది. వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సులు, డెంటిస్టులు, ఫార్మాసిస్టులు, ఆయుష్‌ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రోజ్‌గార్‌ సేవక్, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ, వెటర్నరీ సిబ్బంది, మాజీ సైనికులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు ఇలా మొత్తం 6,23,202 మంది కోవిడ్‌ వారియర్స్‌ అందుబాటులో ఉన్నారు.

 

జిల్లా నోడల్‌ అధికారులు, ద‌వాఖాన‌ల వివరాలు, కోవిడ్‌ను ఎదుర్కొవడంలో శిక్షణ తదితర అంశాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది కేంద్ర ప్ర‌భుత్వం. ఆయా రంగాల ప్రతినిధులకు శిక్షణ కోర్సులపై ప్రత్యేకంగా ‘ఐగాట్‌’ వెబ్‌ పోర్టల్‌ను రైడా రూపొందించింది. ఇక తెలంగాణలో కోవిడ్‌పై పోరాడుతున్న యోధులు  3,95,129 మంది అందుబాటులో ఉన్నట్లు కేంద్రం త‌న వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఏపీలో క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి అంత భారీ సంఖ్య‌లో కొవిడ్ వారియ‌ర్స్‌ను మోహ‌రించిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై జ‌నం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: